వైరల్ వీడియో.. మోదీ వైపు దూసుకొచ్చిన చిన్నారి. తర్వాత ఏం జరిగిందో చూడండి | PM Modi Breaks Security Protocol to Meet 4 year old Fan.

Modi breaks protocol yet again for 4 years child

Prime Minister Narendra Modi, Modi Protocol, Modi Gujarat Tour, Modi Gujarat Protocol, Modi 4 Years CHild Video, Modi Meet Little GIrl, Modi Break Protocol, PM Protocol, PM Modi Little Fan, Modi Meet Little Fan

Prime Minister Narendra Modi broke security protocol on Monday to meet a four-year-old fan who attempted to reach his convoy but was stopped by the elite commandos protecting the PM in Gujarat Tour. .

ITEMVIDEOS:నాలుగేళ్ల చిన్నారి కోసం మోదీ ఏం చేశాడంటే...

Posted: 04/17/2017 03:51 PM IST
Modi breaks protocol yet again for 4 years child

ప్రోటోకాల్ అంటే ప్రధాని నరేంద్ర మోదీకి బొత్తిగా ఇష్టం లేదేమో. ఎప్పటికప్పుడు నిబంధనలను ఉల్లంఘించి వెళ్లటం ఆయనకు పరిపాటిగా మారింది. గణతంత్ర్య దినోత్సవ వేడుకలో కాన్వాయ్ దిగి నడుచుకుంటూ వెళ్లం, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు స్వయంగా ఆహ్వానం పలకటం ఇలా ఎప్పటికప్పుడు ఆయన వ్యవహార శైలి ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది.

తాజాగా గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన మళ్లీ అలాంటి ఫీటే ఒకటి చేశారు. తనని కలవటానికి వచ్చిన నాలుగేళ్ల పాపతో ముచ్చటించి వార్తల్లో నిలిచారు. సోమవారం టాపీ జిల్లాలో ఓ పశు దాణ ఫ్లాంట్, ఐస్ క్రీం ఫ్లాంట్ ను ప్రారంభించిన ఆయన తర్వాత కాన్వాయ్ లో బయలుదేరారు. ఇంతలో ఓ నాలుగేళ్ల పాప మోదీ కాన్వాయ్ వైపు దూసుకొచ్చింది.

వెంటనే భద్రతా దళాలు ఆ పసిపాప వైపు రావటంతో భయంతో వెనకడుగు వేసింది. విషయం గమనించిన మోదీ వెంటనే కాన్వాయ్ ను ఆపి ఆ పాపను దగ్గిరికి తీసుకుని కాసేపు ముచ్చటించి అనంతరం అక్కడి నుంచి బయలుదేరాడు. పది రోజుల క్రితం భువనేశ్వర్ పర్యటనలో కూడా తనను చూడటానికి వచ్చిన జనాలను స్వయంగా దగ్గరికి వెళ్లి పలకరించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది గుజరాత్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పలు సంక్షేమ పథకాలను త్వరగతిన ప్రారంభించేందుకు స్వయంగా మోదీనే రంగంలోకి దిగుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Narendra Modi  Gujarat Tour  Break Protocol  

Other Articles