మాయ మాటలతో మళ్లీ లొల్లి షురూ అయ్యింది | SP does not need 'grand alliance' to counter BJP.

Mulayam singh differs with akhilesh yadav after alliance talk

Akhilesh Yadav, Akhilesh Yadav Mayawati, Mayawati Grand Alliance, Uttar Pradesh Grand Alliance, Mayawati Mulayam Singh Yadav, Mulayam Akilesh Rift, Mulayam Singh Akhilesh Friction Again, UP Grand Alliance, BSP SP

Mulayam Singh Dismisses Son Akhilesh Yadav's Alliance Talk with BSP Chief Mayawati. We Are Capable On Our Own says with son Akilesh Yadav.

అఖిలేష్ మాయలో పడకుండా ఆపుతున్నాడు

Posted: 04/17/2017 01:28 PM IST
Mulayam singh differs with akhilesh yadav after alliance talk

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలో దారుణ ఓటమి తర్వాత కొంత కాలంగా బీజేపీతో సఖ్యతనే కనబరుస్తోంది సమాజ్ వాదీ పార్టీ. అయితే ములాయం నిర్ణయం అదే అయినప్పటికీ అఖిలేష్ కు మాత్రం మోదీ ప్రభుత్వంతో మైత్రి అస్సలు ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థి అయిన బహుజన్ సమాజ్ వాదీ పార్టీతో పొత్తు కు సై అనటం ఆసక్తికరంగా మారింది.

2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు భావ సారూప్యత కలిగిన ఏ పార్టీతోనైనా కలిసేందుకు సిద్ధమని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఓ ప్రకటన చేసింది. దీనిని స్వాగతిస్తూ, మహా కూటమిలో చేరేందుకు అఖిలేష్ వ్యాఖ్యానించాడు. అయితే ఆ నిర్ణయంపై నేతాజీ ములాయం సింగ్ యాదవ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు అక్కర్లేదని, ఒంటరిగానే సమాజ్ వాదీ సత్తా చాటగలదని, పొత్తు ప్రకటనలతో పార్టీ బలహీనపడ్డ సంకేతాలను పంపుతున్నట్టు అయిందని కొడుకుకు ఆయన చురకలంటించినట్టు తెలుస్తోంది.

మరోపక్క ఊహించని రీతిలో ఘోర పరాభవం చెందిన మాయావతి లాంటి వాళ్లతో పొత్తు పార్టీకే ప్రమాదం అని కూడా సూచించాడంట. పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మంచి సంబంధాలు కొనసాగిస్తూనే, వారి వైఫల్యాలను ఎండగట్టడం లాంటి ప్రత్యామ్నాయ్యాలు చేయాలేగానీ పొత్తుల గురించి మాట్లాడటమేంటని అఖిలేష్ ను ములాయం మందలించినట్టు భోగట్టా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  Grand Alliance Talk  Mulayam Singh  Akilesh Yadav  Mayawati  

Other Articles