most powerful woman Indra Nooyi

Most powerful woman indra nooyi

Indra Krishnamurthy Nooyi , Indra Nooyi, Pepsi co, Pepsi, Pepsi co CEO, Powerful Woman, Woman

Indra Krishnamurthy Nooyi is an India-born, naturalized American, business executive and the current Chairperson and Chief Executive Officer of PepsiCo, the second largest food and beverage business in the world by net revenue

శక్తివంతమైన మహిళలగా ఎదిగిన ఇంద్రా నూయి

Posted: 12/14/2015 04:08 PM IST
Most powerful woman indra nooyi

బర్త్‌డే పార్టీలకు, నలుగురు స్నేహితులు కలిసినప్పుడు సరదాగా కూల్‌డ్రింక్ తాగడం కామన్. కానీ ఆ కూల్‌డ్రింక్ సంస్థను నడిపించే శక్తి గురించి మాత్రం ఎవ్వరూ ఆలోచించరు. ఒకవేళ ఆలోచించిన అలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇదంతా ఇప్పుడెందుకు చెప్పాల్సి వచ్చిందటే... పెప్సీ కంపెనీ సీఈవో ఇంద్రా నూయి ద మోస్ట్ పవర్‌ఫుల్ ఉమన్ గా ఫోర్బ్స్ ప్రకటించింది. 66 బిలియన్ డాలర్ల రెవెన్యూ జనరేట్ చేయడంలో ఈమె ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉందట. ఇక మన భారతీయులకైతే నూయీ ఏకంగా స్త్రీ శక్తికి ప్రతిరూపం. స్ట్రాంగ్ ఉమన్.

పెప్సీకో సీఈవోగానే కాదు, ఆమె అతిపెద్ద బీవరేజి, ఫుడ్ బిజినెస్ సంస్థకు పవర్‌హౌజ్. ఆమె చెన్నై నగరంలో అక్టోబర్ 28, 1955లో జన్మించారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ నుండి డిగ్రీ, కోల్‌కతాలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఎ చదివారు. నూయి మొదటి ఉద్యోగం ఇండియాలోనే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీతో మొదలైంది. ఆ తర్వాత మోటరోలా, బ్రౌన్ బొవరీ వంటి పలు సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. తర్వాతే తాను పెప్సీకోలో (1994) చేరారు. అనతి కాలంలోనే తన ప్రతిభ చూపి 2001లో సీఈవోగా పదోన్నతి పొందారు.

అయితే, ప్రపంచ వ్యాప్తంగా పెప్సికో అనేక రంగాల్లో కాలు మోపడానికి తన పదునైన వ్యూహాలలో సంస్థ దశ, దిశనే మార్చివేసిందని మేనేజ్‌మెంట్ నిపుణులు అంటారు. ఈమె తెచ్చిన వ్యూహాత్మక మార్పులలో 1997లో పెప్సీకో ఆధీనంలో ఉన్న ఫాస్టుఫుడ్ రెస్టారెంట్‌లను ఒక కొత్త సంస్థగా విభజించడం ఒకటి. ఈ ట్రైకాన్ సంస్థే ఇప్పుడు ఎం బ్రాండ్‌గా మారింది. 1998లో ట్రాపికానాను పెప్సికోలో విలీనం చేయడంలోనూ తాను కీలక పాత్ర పోషించారు. 2006లో సీఈవోగా బాధ్యతలు చేపట్టాకే పెప్సికో రాబడి 72 శాతం వృద్ధి సాధించించడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఫోర్బ్స్ పత్రిక ఈమెకు మూడో స్థానం కట్టబెట్టిందంటే ఇంద్ర అంటే ఏమిటో అర్థమౌతుంది.

* ఇంద్రా నూయి ఒకప్పుడు గర్ల్స్ గిటార్ బ్యాండ్‌ని లీడ్ చేసేది.
* తన కెరీర్ ప్రారంభంలో డాలర్‌లో నూరోవంతు అంటే 50 సెంట్లు అదనంగా సంపాదించడం కోసం స్మశానంలో రిసెప్షనిస్ట్‌గా పనిచేసింది.
* 44 సంవత్సరాల పెప్సీ చరిత్రలో ఇంద్రా నూయి విజయవంతంగా కంపెనీని నడిపిస్తున్న ఐదవ సీఈవో.
* 2007, 2008 సంవత్సరాల్లో టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన వరల్డ్ మోస్ట్ 100 ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్స్ లిస్ట్‌లో రెండుసార్లు చోటు సంపాదించింది.
* 2007లో భారత ప్రభుత్వం చేత పద్మభూషణ్ అవార్డు అందుకుంది.
* పెప్సీకో సీఈవోగా ఇంద్రా నూయికి ప్రపంచ మార్కెట్లో 144 మిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది.
* ఇంద్రా నూయి మద్రాస్‌లో పుట్టి పెరిగింది. కలకత్తాలోని ఐఐఎం పూర్వ విద్యార్థి కూడా.
* ఇంద్రా నూయికి కరావ్‌కే సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె ఇంట్లో కరావ్‌కే మెషీన్ ఉంది. దాంతో ఖాళీ సమయాల్లో ఆమె ఇంట్లో పాటలు కూడా పాడుతుంది.
* పెప్సీలో చేరకముందు ఇంద్రా నూయి వివిధ హోదాల్లో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, ఆసియా బ్రౌన్ బోవెరీ, మోటోరోలా, జాన్సన్ అండ్ జాన్సన్, మెట్టుర్ బియర్డ్‌సెల్ వంటి కంపెనీల్లో పనిచేసింది.
* 2001 నుంచి ఇంద్రా నూయి పెప్సీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌వో)గా కూడా పనిచేస్తున్నది. ఇంద్రా నూయి సీఎఫ్‌వోగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పెప్సీ లాభాలు 2.7 బిలియన్ డాలర్ల నుంచి 6.5 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indra Krishnamurthy Nooyi  Indra Nooyi  Pepsi co  Pepsi  Pepsi co CEO  Powerful Woman  Woman  

Other Articles