Worlds first women Prime Minister Sirimao bandaru nayake

Worlds first women prime minister sirimao bandaru nayake

Sirimao bandaru nayake, First women PM, Women Prime Minister, Sirimao, Srilanka

Sirimao bandaru nayake is the First Women Prime Minister. She was worked as a PM in between 1989 to 94. She was a Sri Lankan politician and the modern world's first female head of government.

ప్రపంచంలో తొలి మహిళా ప్రదాని సిరిమావో బండారు నాయకే

Posted: 12/08/2015 04:26 PM IST
Worlds first women prime minister sirimao bandaru nayake

ప్రపంచం లోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి,అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. దివంగత సిరిమావో బండారు నాయకే. శ్రీలంక ఫ్రీడం పార్టీ తరఫున పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన ఈమె శ్రీలంక దేశానికి 7వ, 9వ, 15వ ప్రధానిగా మూడుసార్లు బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. అలా ఆమె మొదటిసారి జులై21, 1960న మొట్టమొదటి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రోజుగా జులై 21కి ప్రాముఖ్యాన్ని సంతరించి పెట్టారు.

1916 ఏప్రిల్‌ 17వ తేదీన ఓ బౌద్ద కుటుంబంలో సిరి మావో రతవాతే దియాస్‌ బండారునాయకే జన్మిం చారు. లంక రాజధాని కొలంబోలోని సెయింట్‌ బ్రిగేడ్స్‌ కాన్వెంట్‌లో విద్యనభ్యసించారు. ఆ తరువాత యుక్తవయస్సు వచ్చాక ఆమెకు దియస్‌ బండారునాయకేతో 1940వ సంవత్సరంలో వివాహం జరిగింది.బండారు నాయకే శ్రీలంక ఫ్రీడం పార్టీకి 40 సంవత్సరాల పాటు తన అవిరళ కృషి జరిపారు.1955 ప్రాంతంలో అప్పటి విపక్ష నేతగా ఆయన సింహళ భాషను అధికారభాషగా గుర్తించాలని, తాను గనక అధికారంలోకి వస్తే, 24గంటల్లోనే సింహళాన్ని ఏకైక అధికార భాషగా గుర్తిస్తూ ఆదేశాలిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.అన్న ట్టుగానే బండారునాయకే నేతృత్వంలోని కూటమి విజయం సాధించటం. సింహళాన్ని అధికార భాషగా గుర్తించటం జరిగిపోయాయి. దాంతో తమిళ-సింహళ తెగల మధ్యఘర్షణలు చెలరేగి 150 మంది తమిళులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పరిస్థితి తీవ్రతను గమనించిన ఆయన కొద్దిపాటి సడలింపులు విధించినా.. ఆ తరువాత అనేక ఘర్షణలు జరిగి వందలాది తమిళులు మరణించారు.

ఆ తరువాత 1959 సెప్టెంబర్‌ 25న బండారునాయకే ఒక బౌద్ధ సన్యాసి చేతిలో హత్యకు గురయ్యారు. అలాంటి పరిస్థితుల్లో బండారునాయకే జీవన సహచారిణి సిరిమావో బండారు నాయకే 1960 జులై 21వ తేదీన శ్రీలంక ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. లంక సెనేట్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆమె తన పరిపాలనా కాలంలో వివిధ రంగాలను జాతీ యీకరణ చేస్తూనే దేశాభివృద్ధికి విశేషంగా పాటు పడ్డారు.సిరిమావో పరిపాలన కాలంలో చేపట్టిన సంస్కరణల కారణంగా అనేక దేశాలకు శ్రీలంక దగ్గరైంది. పాలనా కాలంలో ఈమె సింహళ భాషను శ్రీలంక జాతీయ భాషగా చేశారు. అయితే ఆమె చేపట్టిన ఈ చర్య అక్కడ నివాసం ఉంటున్న తమిళులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో 1965లో జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ పరాజయం పాలైఅధికారం నుంచి తప్పుకుంది. ఇదే సమయంలో శ్రీలంకలో కొత్త రాజ్యాంగం కూడా అమల్లోకి వచ్చింది.

తర్వాత 1970లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన సిరియావో.. ప్రధాన మంత్రిగా బాధ్యతలు మరోసారి చేపట్టారు. అప్పటి వరకూ సిలోన్‌గా పిలిచిన లంకను శ్రీలంకగా నామకరణం చేశారు. దేశంలో అప్పుడే వేళ్లూను కుంటున్న వేర్పాటువాదాన్ని భారత, పాకిస్తాన్‌ దళాల సాయంతో సిరిమావో అణచివేశారు. ఆ తరువాత 1977వ సంవ త్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సిరిమావో నేతృత్వం వహిస్తున్న శ్రీలంక ఫ్రీడం పార్టీ పరాజయం పాలైంది. ఆ తరువాత మళ్లీ 1944లో అధికారంలోకి వచ్చిన ఈమె ఆగస్టు 10, 2000 సంవత్సరందాకా ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం అదే సంవత్సరం అక్టోబర్‌ 10వ తేదీన గుండెపోటు కారణంగా సిరిమావో బండారు నాయకే తుదిశ్వాస విడిచారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sirimao bandaru nayake  First women PM  Women Prime Minister  Sirimao  Srilanka  

Other Articles