The Biography of devanaboina nagalakshmi | famous telugu scientist | Scientists

Devanaboina nagalakshmi biography famous telugu scientist

devanaboina nagalakshmi biography, devanaboina nagalakshmi history, devanaboina nagalakshmi life story, devanaboina nagalakshmi researches, devanaboina nagalakshmi, telugu famous scientists, animal scientists

devanaboina nagalakshmi Biography famous telugu scientist : The Biography of devanaboina nagalakshmi who researches on animals food in different types.

పశువుల దాణాను వినూత్న విధానాల ద్వారా రూపొందించిన శాస్త్రవేత్త

Posted: 07/01/2015 04:54 PM IST
Devanaboina nagalakshmi biography famous telugu scientist

సాటి మనిషికి సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాని ఈ సమాజంలో మూగజంతువుల పట్ల కనీసం కనికరం చూపేవారు చాలా అరుదు. ఆ తక్కువ వ్యక్తుల్లో దేవనబోయిన నాగలక్ష్మి ఒకరు. మూగజీవుల పట్ల మానవత్వం కలిగిన ఈమె.. వాటికోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలనే తపనతో జంతుశాస్త్రంలో విద్యాభ్యాసం గడించి.. ఆపై ఎన్నో పరిశోధనలు చేసింది. అందులో భాగంగానే ఈమె పశువుల దాణాను వినూత్న విధానాల ద్వారా రూపొందించడం మీదే ఎక్కువ పరిశోధనలు చేసింది. అడవులు తరిగిపోతున్న నేపథ్యంలో జంతువులకు ప్రత్యామ్నాయ దాణా ఆవశ్యతను గుర్తించి.. ఆ మేరకు పరిశోధనలు ప్రారంభించారు. ఇందుకుగాను ఆమెకు ఎన్నో అవార్డులు వరించాయి.

జీవిత విశేషాలు :

1969 సెప్టెంబర్ 24వ తేదీన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో నాగలక్ష్మీ జన్మించారు. తండ్రి సైనికోద్యోగి కావడంతో ఆమె విద్యాభ్యాసం మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొనసాగింది. ఈమె జబల్ పూర్ లో డిగ్రీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం యిజ్జత్ నగరంలోని ఐ.వి.ఆర్.ఇనిస్టిట్యూట్ లో పోస్టు గ్రాడ్యుయేట్ చదివారు. అనంతరం ఈమె ‘యానిమల్ న్యూట్రిషన్’ అంశంలో పరిశోధనలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆమె ఈ విశ్వవిద్యాలయంలో ఐ.సి.ఎ.ఆర్ ఫెలోషిప్ అందుకున్నారు. పి.జి చేసి కొన్ని ఉద్యోగాలలో చేరిన అనంతరం యానిమల్ సైన్సెస్ లో ఒంటరి మహిళగా పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు.

పరిశోధనా జీవితం :

అడవులు క్రమంగా తరిగిపోతున్న నేపథ్యంలో.. పశువులకు ప్రత్యామ్నాయ దాణా ఆవశ్యకతను గుర్తించి ఆమె వినూత్న విధానాల ద్వారా దాణాను రూపొందించడం మీదే పరిశోధనలు ప్రారంభించారు.
* చెరకు పిప్పిని ఎరువుగానే కాకుండా దాణాకు వాడవచ్చునని నిరూపించారు.
* మొక్కజొన్నల్ని తీసివేసిన తర్వాత మిగిలే కంకులను మేతగా ఉపయోగించే మార్గం కనుగొన్నారు.
* ఇళ్ళలో మిగిలిన ఆహార పదార్థాలను, చెత్తను కూడా పశువుల దాణాగా రూపొందించడమే ఈమె పరిశోధనా విజయమైంది.
*పత్తి గింజల్లో ఉండే గాసిపాల్ అనే విష పదార్థాన్ని తొలగించేందుకు కొన్ని పద్ధతులను అనుసరిస్తే దాణాగా ఉపయోగపడుతుందని చెప్పారు.
* వేపగింజలు, పత్తి గింజలు నుంచి నూనెను తీసివేసిన తరువాత మిగిలిన పిండిని కేక్ ను ఎరువుగానే కాకుండా పశువుల దాణాకు కూడా వాడవచ్చునని నిరూపించారు.
* చేదైన వేప గింజల పిండికి యూరియా, ఆల్కలీ ట్రీట్ మెంటు ఇవ్వడం ద్వారా ఆయా విషాలను పోగొట్టి దాణాగా వాడితే జంతువులకూ చాలా బలవర్ధకమైన ఆహారం కాగలదని రుజువు చేశారు.

అవార్డులు :

పశువుల దాణాను వినూత్న విధానాల ద్వారా రూపొందించడంలో విజయవంతమైన ఈమెను.. 2003లో అఖిల భారత యానిమల్ సైన్సెస్ లో వున్న నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ (నాస్) 2001-2002 సంవత్సరానికిగాను ‘యంగ్ సైంటిస్టు అవార్డుకు ఎంపిక చేసింది. యానిమల్ సైన్సెస్ లో విశేష పరిశోధనా కృషి చేసినవారిని వరించే ఈ అవార్డును ఈమె 2003 ఫిబ్రవరిలో భోపాల్ లోజరిగిన 6వ వ్యవసాయ విజ్ఞాన కాంగ్రెస్ లో అందుకున్నారు. ఆనిమల్ న్యూట్రిషన్ అసోసియేషన్ లో జీవితకాల సభ్యత్వం పొందిన ఈమె.. ‘మిసెస్ మిమల్ శ్రీనివాస్ క్షీరసాగర్ మెమోరియల్ అవార్డు’ ను అందుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : devanaboina nagalakshmi  telugu scientists  

Other Articles