Malathi chandur biography telugu literature columnist writer

malathi chandur news, malathi chandur latest news, malathi chandur life history, malathi chandur wikipedia, malathi chandur wiki, malathi chandur story, malathi chandur history, malathi chandur biography, telugu literatures, telugu wirters, telugu columnists, telugu news

malathi chandur biography telugu literature Columnist writer

ఉన్నత విద్యార్హత లేకపోయినా.. సాహిత్యంలో అవార్డు గెలిచింది!

Posted: 11/10/2014 03:08 PM IST
Malathi chandur biography telugu literature columnist writer

మాలతీ చందూర్... తెలుగువారికి సుపరిచితురాలైన ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్. చదువులో గొప్ప అనుభవం లేకపోయినా.. సాహిత్యంలో మాత్రం తనదైన ప్రతిభను నిరూపించుకుంది. 1950 నుంచి దాదాపు మూడుదశాబ్దాలపాటు సాహిత్యరంగంలో కొనసాగిన ఈమె... సాహిత్య అకాడమీ బహుమతిని గెలుచుకుంది. ఆనాడు ఎన్నో కష్టనష్టాలతోపాటు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఆమె అందనంత ఎత్తుకు ఎదిగింది. ఇతర మహిళలకు నిదర్శనంగా నిలిచింది.

జీవిత చరిత్ర :

1930 సంవత్సరంలో కృష్ణాజిల్లాలోని నూజువీడులో నివాసమున్న జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు దంపతులకు మాలతీ చందూర్ జన్మించింది. వీళ్లందరూ ఆరుగురు సహోదరులు... అందులో మాలతీ చిన్నది! ఆమె బాల్యం అధికభాగం నూజువీడులోనే గడిచింది. 8వ తరగతి వరకు ఎస్ఎస్ఆర్ పాఠశాలలోనే చదువుకున్న ఆమె.. తర్వాత చదువుకోవడానికి ఏలూరు వెళ్లింది. అక్కడున్న తన మామయ్య (చందూర్) ఇంటికి చేరిన అనంతరం సెయింట్ థెరిస్సా స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చేరింది. వారున్న ఇంటికి దగ్గరలోనే ‘కథావీధి’ అనే సాహిత్య పత్రిక వుండేది. అదే ఆమెకు సాహిత్యరంగంలో అడుగులు వేయడానికి చాలా తోడ్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. మామయ్య (చందూర్)కి పరిచయమున్న శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్తి, నండూరి సుబ్బారావు, వెంకటచలం, కావలి లక్ష్మీనరసింగం వంటి సాహిత్య కవులు వచ్చేవారు. అప్పుడే ఆమె వారందరినీ చూడటం జరిగింది.

1947 చివర్లో మాలతీ, చందూర్‌ మద్రాసులోని జార్టిటెన్ కు చేరుకుని.. అక్కడే వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఆ తరువాతే ఆమె ప్రైవేటుగా ఎస్‌ఎస్‌ఎల్‌సి విద్యను పూర్తి చేశారు. అంతకంటే మించి ఆమె పెద్దగా చదువుకోలేదు. అయితే సాహిత్యంలో తనకున్న ప్రతిభను మాత్రం నిరూపించుకోగలిగారు. 1949లో ఆమె రచనా వ్యాసంగం ప్రారంభమైంది. అప్పట్లో రేడియోలో ఆమె రచనలను చదివి వినిపించేవారు. ఆ రోజుల్లో ఎగ్మూర్‌లో ఉన్న రేడియో స్టేషన్‌కు వెళితే ఒక సాహితీ సభకు వెళ్ళినట్లుండేది. అక్కడే ఆచంట జానకిరాం, బుచ్చిబాబు, జనమంచి రామకృష్ణ, రాజమన్నార్‌, మునిమాణిక్యం నరసింహారావు వంటి వారిని దగ్గరగా గమనించే అవకాశం కలిగింది. 1952 నుంచి రచనా వ్యాసంగంలో తీరిక లేకుండా గడిపారు.

సాహిత్య సేవలు :

1952 నుంచి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ఆడవారి కోసం మాలతీ చందూర్ రాసిన ‘ప్రమదావనం’ అనే ‘Dear Abby’ శీర్షిక రెండు దశాబ్దాలకు పైగానే నడపబడింది. ఈ శీర్షికలో వంటలు, వార్పులే కాకుండా ఇంగ్లీషు నవలలను ఆమె పరిచయం చేసింది. విదేశాల నుంచి  తిరిగివచ్చినవారితో అక్కడ వారి అనుభవాలు రాయించటం మొదలైనవి చేస్తూ... ఆడవారికి ఒక సలహాదారుగా ఉండి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఈమె రాసిన ‘‘జవాబులు’’ శీర్షకను ఆడవారితోపాటు మగవారు కూడా చదివేవారు.

మాలతీ తెలుగులో పాతికదాకా మహిళా ప్రధాన నవలలు రాయడంతోపాటు 300కు పైగా ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించారు. ఈమె రచయితగా తన ప్రతిభను నిరూపించకుని... నవలా రచయిత్రిగా, మహిళా వృత్తాలపై కాలమిస్టుగా అనేక పురస్కారాలు అందుకొంది. 70వ దశకములో కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా పనిచేసిన ఈమె తాను చూసే తమిళ సినిమాలను అర్ధం చేసుకోవటానికి తమిళ భాష నేర్చుకున్నది. అయితే క్యాన్సర్ వ్యాధితో కొన్నాళ్లపాటు బాధపడిన ఆమె.. 2013 ఆగస్టు 21 న చెన్నైలో ఈమె తుదిశ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : malathi chandur  telugu literatures  telugu columnists  telugu news  

Other Articles