Usha uthup famous playback pop singer indian film industry bollywood

usha uthup, usha uthup news, usha uthup latest news, usha uthup birthday wishes, usha uthup birthday news, usha uthup playback singer, usha uthup pop singer, usha uthup wikipedia, usha uthup wiki, usha uthup biography, usha uthup life history, usha uthup life story

usha uthup famous playback pop singer indian film industry bollywood

ప్రసిద్ధ భారతీయ పాప్ గాయనిగా పేరొందిన ఉషా

Posted: 11/08/2014 03:49 PM IST
Usha uthup famous playback pop singer indian film industry bollywood

చలనచిత్రపరిశ్రమలో ఒకప్పుడు పాప్ సింగర్లు చాలా తక్కువ సంఖ్యలో వున్న నేపథ్యంలో ఉషా ఉతుప్ తనకున్న అద్భుతమైన సింగింగ్ టాలెంట్ తో ఒక ప్రసిద్ధ పాన్ గాయనిగా ఎదిగింది. 1960లోనే పాప్ సాంగ్స్ పాడటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె...  బెంగాలి, హిందీ, పంజాబీ, అస్సామీ, ఒరియా, గుజరాతి, మరాఠీ, కొంకణి, మలయాళం, కన్నడ, తమిళ్, తుళు, తెలుగులతో కలిపి 16 భారతీయ భాషలలో పాడారు. అంతేకాదు.. ఆంగ్లం, డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, సింహళీస్, స్వాహిలి, రష్యన్, నేపాలీస్, అరబిక్, క్రియోల్, జులు, స్పానిష్ వంటి అనేక విదేశీ భాషలలో తన గానంతో ప్రేక్షకులను మైమరిపించారు. బహుశా ఇన్నిభాషల్లో పాటలు పాడిన పాప్ సింగర్స్ మరొకరు లేరని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు.

జీవిత చరిత్ర :

1947 నవంబర్ 8వ తేదీన తమిళనాడులోని చెన్నైలో నివాసమున్న ఒక బ్రాహ్మణకుటుంబంలో ఉషా జన్మించింది. కొన్నాళ్ల తరువాత ఆమె తండ్రి సామీ అయ్యర్ ముంబయిలో పోలీస్ కమిషనర్ గా ఉద్యోగం సాధించారు. దీంతో కుటుంబం మొత్తం అక్కడే షిఫ్ట్ అయ్యారు. ఉషాకు ఉమా పోచా, ఇందిరా శ్రీనివాసన్, మాయా సామీ అనే ముగ్గురు సోదరీమణులతోపాటు ఇద్దరు సోదరులు వున్నారు. ముంబయిలోని బైకుల్లాలో గల లవ్‌లేన్ వద్ద గల స్థానిక పాఠశాలలో హాజరయ్యారు. బాల్యం నుంచే సంగీతంపై ఎక్కువ మక్కువ పెంచుకున్న ఉషకు పాఠశాలలో నిర్వహించే సంగీత కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆశ వుండేది. అయితే ఆ సమయంలో ఈమె స్వరం సరిగ్గా లేకపోవడం వల్ల ఆమెను సంగీత తరగతుల నుంచి బయటకు పంపించేసేవారు. కానీ ఆమె సంగీత ఉపాధ్యాయుడు ఆమెలో వున్న సంగీత ప్రతిభను గుర్తించి.. ఆమెకు చిడతలు లేదా ఆడుకోవడానికి త్రికోణాలు ఇచ్చేవారు.

సంగీతంలో సాంప్రదాయపరమైన శిక్షణ పొందనప్పటికీ పాప్ పాటల వాతావరణంలో పెరిగారు. ఆనాడు ఈమె తల్లిదండ్రులు పాశ్చాత్త సంగీతం నుంచి భారతీయ గాయకుల పాటలను... అందులో హిందూస్తానీ, కర్నాటక సంగీతం వరకు విస్తృత శ్రేణి సంగీతాన్ని రేడియోలో వింటూ ఉండేవారు. అప్పుడు ఉషా వారితో జత కలిపేవారు. అలాగే ఉష వారింటి పక్కనే వున్నవారు భారతీయ సంప్రదాయ సంగీతాన్ని అభ్యసించమని ప్రేరేపించడంతో ఆమె అందులోనూ ప్రావీణ్యం పుచ్చుకున్నారు. ఇలా మిశ్రమ పద్ధతి ఆమెకు సంగీతంలో ప్రత్యేక ముద్ర వేయించుకుని.. నేడు భారతీయ ప్రసిద్ధ పాప్ గాయకురాలిగా పేరొందింది.

వ్యక్తిగత జీవితం :

ఆమె గతంలో స్వర్గీయ రాము అయ్యర్ ను వివాహం చేసుకొని, తరువాత కేరళకు చెందిన జానీ చాకో ఉతుప్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె అంజలి మరియు కుమారుడు సన్నీ ఉన్నారు.

పురస్కారాలు

1. షాలిమార్ (చిత్రం) (1978)లోని ‘‘వన్ టూ చ చచ’’ పాటకు ఉత్తమ నేపధ్య గాయనిగా ఫిలింఫేర్ పురస్కారం లభించింది.
2. ప్యారే దుష్మన్ (1980) చిత్రంలోని ‘‘హరి ఓం హరి’’ పాటకు ఉత్తమ నేపధ్య గాయనిగా ఫిలింఫేర్ పురస్కారం
3. అర్మాన్ (1981) చిత్రంలోని ‘‘రంభ హో’’ పాటకు ఉత్తమ నేపధ్య గాయనిగా ఫిలింఫేర్ పురస్కార ప్రతిపాదన

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles