Tamil actress deepa

Tamil Actress Deepa Videos, Movies, Pictures, News and Filmography, Deepa, Deepa Videos, Deepa Movies, Kollywood Deepa

Tamil Actress Deepa Videos, Movies, Pictures, News and Filmography, Deepa, Deepa Videos, Deepa Movies, Kollywood Deepa

Tamil Actress Deepa.gif

Posted: 04/04/2012 12:19 PM IST
Tamil actress deepa

Tamil_Actress_Deepa

Deepaమూడు దశాబ్దాల క్రితం... ‘అక్బర్ సలీం అనార్కలి’ చిత్రంలో ‘సిపాయీ ఓ సిపాయీ నీకై ఎంత ఎంత వేచి వేచి చూశానో’ అంటూ సలీమ్ అయిన బాలకృష్ణతో అనార్కలిగానూ, ‘దానవీరశూరకర్ణ’లో ‘కలగంటినో స్వామి కలగంటిని’ అంటూ అభిమన్యుడయిన బాలకృష్ణతో ఉత్తరగానూ విరహగీతాలు ఆలపించిందో ముద్దుగుమ్మ! ఆ తర్వాత ‘లేడీస్ టైలర్’, ‘స్వాతిముత్యం’లో తన అందంతోనూ, నటనతోనూ కూడా మురిపించి మైమరపించింది ఆ పసిడిబొమ్మ. ఈ మాత్రం ఇంట్రడక్షన్ చాలు... ఆ మోహనాంగి ఎవరో తెలుసుకోడానికి. చిరునవ్వులో ముత్యాలు, కంటి చూపులో వెలుగులు విరజిమ్మిన ఆ సుందర తార... దీప. అయితే ఉన్నట్టుండి ఆ నట‘దీప’ వెండితెర నుండి తన వెలుగును ఎందుకు మాయం చేసింది? ఇప్పుడామె ఏం చేస్తోంది ?

‘ఊగిసలాడకె మనసా... నువ్వు ఉబలాట పడకే మనసా’ అంటూ కలవర పడుతున్న మనసుకు సర్దిచెప్పుకుంటూ ‘కొత్తనీరు’లో తన హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన దీప... ఏడేళ్ల వయసులోనే నట జీవితానికి శ్రీకారం చుట్టింది. కమల్‌హాసన్ తొలిసారి నటించిన ‘కళత్తూరు కన్నమ్మ’ చిత్రమే దీపకూ తొలి సినిమా. నిజానికి అందులో కమల్ చేసిన పాత్రకు మొదట దీపనే తీసుకున్నారట! కానీ మగపిల్లాడి వేషం కాబట్టి జుత్తు కత్తిరించుకోవాలని అంటే, దీప తల్లి నిరాకరించారట. దాంతో ఆ వేషం కమల్‌తో వేయించి, దీపకు మరో చిన్న పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత తన పన్నెండేళ్ల వయసులో దీపకు నిర్మాత మెరిలాండ్ సుబ్రహ్మణం ‘శ్రీకృష్ణ’ అనే సినిమాలో వేషం ఇచ్చారు. అలాగే దీపను ఓ కార్యక్రమంలో చూసిన నాటి మలయాళ నటుడు ప్రేమ్‌నజీర్, దీప తన భావి హీరోయిన్ అన్నారు. రెండు నెలల్లోనే ఆయన మాట నిజమయ్యింది. తీరైన ముఖం, ఆకట్టుకునే ఆకృతితో దీప త్వర గానే అభిమానుల్ని సంపాదించుకుంది. తర్వాత ‘అమెరికా అమ్మాయి’ చిత్రంతో తెలుగు రంగంలో తన పాదం మోపింది. అక్బర్ సలీం అనార్కలి, దానవీరశూరకర్ణ, కొత్తనీరు, లేడీస్ టైలర్, స్వాతిముత్యం... ఇలా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది.

కుటుంబమే ప్రపంచం...

Tamil_Actress_Deepa1సినిమాల్లో నటిస్తున్న సమయంలో తన మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లాడిన దీప, ఓ పిల్లాడు పుట్టాక, తన బాగోగులు చూసుకోడానికి సినిమాలకు స్వస్తి చెప్పారు. నాటి నుంచి నేటివరకూ కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడానికే తన సమయమంతా కేటాయించారు. ప్రస్తుతం కేరళలోని కొచ్చిలో భర్త, కొడుకు, కోడలు, మనవడితో ఆనందంగా కాలం వెళ్లబుచ్చు తున్నారు. ఇటీవలే చెన్నైలో తన యాభయ్యవ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. తమ కుటుంబ చర్చిలో ప్రార్థనలు చేస్తూ, వీలైనప్పుడల్లా సమాజసేవ చేస్తూ ప్రశాంతంగా గడుపు తున్నారు. ఉచితంగా వివాహాలు చేయడం, చిన్నారులకు విద్యావకాశాలు కల్పించడం లాంటివి చేస్తున్నారు.

‘‘సడెన్‌గా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు, ఇప్పుడెలా ఉన్నారు’’ అని పలకరిస్తే... ‘‘చాలా సంతోషంగా ఉన్నాను, ఈ మధ్యనే బామ్మను కూడా అయ్యాను’’ అంటూ మురిసిపోతూ చెప్పారామె. ‘‘మరి బామ్మలా కనిపించట్లేదు కదా’’ అంటే, మెల్లగా గతంలోకి వెళ్లిపోయారు. 1971లో తాను కేరళలో బ్యూటీ క్వీన్‌గా ఎన్నికయిన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ‘‘అందం అనేది అందరికీ రాదు. నా వరకు అది నా అదృష్టం’’ అన్నారు.

ఎన్.టి.రామారావు దర్శకత్వంలో నటించడం మరుపురాని అనుభూతి అని, ఆయన సెట్‌లోకి వస్తుంటే క్రమశిక్షణతో మెలిగేవాళ్లమని నాటి అనుభవాలను పంచుకున్నారు. హరిప్రసాద్ అనే అభిమాని తన కోసం దీపక్ అనే పేరు మార్చుకున్నాడని, ఇప్పటికీ అతను తనకు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడుగు తుంటాడని ఆనందంగా చెప్పారు.

Tamil_Actress_Deepa2వెండితెరపై గ్లామర్ సంతకం చేసిన దీప, నటనకు దూరమైనా ఆ రంగంపై మమకారాన్ని మాత్రం చంపుకోలేదు. ప్రస్తుతం రిలయన్స్‌ లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తోన్న తన కొడుకు నిర్మల్‌ని కూడా నటుడ్ని చేయాలని ఆశపడుతున్నారు. తాను ఏవిధంగా సినిమాల్లో అందరి అభిమానాన్ని పొందానో అదే విధంగా తన కొడుకు కూడా పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తన మనుమడిని కూడా సినిమాల్లోకి తీసుకుని వస్తానంటున్నారు. మరి మీరు అంటే, తనకు కూడా చాలా ఆఫర్లు వస్తున్నాయని, కానీ కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని ఆలోచిస్తున్నాననీ అన్నారు. తన కొడుక్కి మంచి పాత్ర వస్తే మాత్రం, అతనితో పాటు నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఉత్సాహాన్ని వెలిబుచ్చారు. ఆవిడ కోరిక తీరాలని, నాటి అందాల సుందరి అభిమానులను మళ్లీ అలరించాలని ఆశిద్దాం !

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Interview with famous tv anchor suma
Deepika chikhalia interview  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles