National geoscience awards winner mvsunanda

National GeoScience Awards, winner M.V.Sunanda, M.V. Sunnada,

National GeoScience Awards winner M.V.Sunanda.National Geoscience Awards-2010 ... The Minister congratulated the Award winners and said that those who have been recognized today are only a reflection of our ... Ms M.V. Sunanda. Disaster ...

National GeoScience Awards winner M.V.Sunanda.GIF

Posted: 02/29/2012 04:04 PM IST
National geoscience awards winner mvsunanda

M.V.Sunanda

Sunandaసునామీ అలల విధ్వంసం, అంతులేని విషాదం. ఆ రాకాసి అలలకు ఆనకట్ట కట్టాలి. పెను ప్రమాదాన్ని ముందే పనికట్టాలి. బీటెక్. చదివి, యువ శాస్త్రవేత్తగా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్ళలోనే ఈ విషయంలో ముందడుడు వేసింది. తెలుగు తేజం సునంద. కడలి గర్భంలోని రహస్యాలని ఛేదిస్తూ కెరీర్ లో కలల తీరం చేరుకునే ప్రతిష్టాత్మక జాతీయ జియోఫిజికల్ అవార్డునీ సొంతం చేసుకున్నారామె. ఈ సబంర్భంగా ఆమె చెప్పిన విషయాలు

సునామీ .... ఎందరో అయాకుల నిండు ప్రాణాల్ని క్షణంలో బలి తీసుకుంది. ఎన్నో సార్లు అభాగ్యుల జీవితాల్లో విషాదం నింపింది. ఊళ్లకు ఊళ్ళనే ఒక్క ఉదుటున తుడిచిపెట్టింది. ఈ జలరాక్షసిని అదుపు చేయడం అనేక దేశాల శాస్త్రవేత్తల ముందున్న పెను సవాల్. కడలి గర్భంలో చెలరేగే అలజడని కళ్లలో దీపాలు పెట్టుకొని అనుక్షణం పర్యవేక్షించాల్సిన బాధ్యత హైదరాబాద్ లోని ‘ఇన్ కాయిస్’ శాస్త్రవేత్తలది. దేశంలోని ఏకైక మహాసముద్ర అభివ్రుద్ధి సంస్థలో ‘డిజాస్టర్ మేనేజ్ మెంట్’ విభాగంలో సునంద పనిచేస్తున్నారు. హిందూ మహాసముద్రంలో చోటు చేసుకునే ప్రతి చిన్న మార్పును క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు 28 దేశాలను అప్రమత్తం చేయాల్సిన పని వాళ్ళ టీంది.. టీం సభ్యురాలిగా ఆ బాధ్యతను అద్భుతంగా నిర్వహిస్తూ ఆమె చేసిన క్రుషికి లభించిన గుర్తింపే జాతీయ పురస్కారం 2010 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా ఆ అవార్డు పొందిన ముగ్గురు మహిళల్లో ఆమె ఒకరు.

కానిస్టేబుల్ కుమార్తె....

లక్ష్యాలు అందరికీ ఉంటాయి. అవి సాధించే నేర్పు, పట్టుదల కొందరికే సొంతం. అలాంటి వారే సునంద. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా పేరొందిన అనంతపురం ఆమె జన్మస్థలం. ఆర్థికంగా అంతగా కలిగిన కుటుంబం కాదు. అయినా ఆవేవీ ఆమె లక్ష్యానికి అడ్డురాలేదు. తండ్రి సాధారణ కానిస్టేబుల్. ఆయనకొచ్చే కొద్దిపాటి జీతమే ఆ కుటుంబానికి ఆధారం. పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలన్న ఆయన తపన ముందు ఆర్థిక సమస్య చిన్నబోయింది. ఎన్ని ఒడిదొడుకులు  ఎదురైనా నాన్న ప్రోత్సాహం, నమ్మకం ఎప్పుడూ సన్నగిల్లలేదు. ఆర్థిక సమస్యలు నాకొదిలి చదువు పై శ్రధ్ధ పెట్టండి అనేవారు. ఆడపిల్లలకు చదువెందుకనే భావనని ఏనాడూ రానివ్వలేదు.

ప్రత్యేకంగా జియోఫిజిక్స్....

‘చిన్నప్పటి నుండి నాది స్వతంత్ర వ్యక్తిత్వం. ఏది చేసినా నాన్న అడ్డు చెప్పేవారు కాదు. అక్కడి క్రమశిక్షణ చాలా ఎక్కువ. ఏపని చేయాలన్నా అది సాదించే వరకు వదిలిపెట్టదు. ఆ పట్టుదలే ఆమెను గ్రూప్ – 1 విజేతగా నిలిపి, డిప్యూటీ కలెక్టర్ హోదాను తెచ్చిపెట్టింది. బీటెక్ చదవాలనుకున్నప్పుడు అందరిలా ఏదో ఒక గ్రూప్ తీసుకొని, అయిపోయాక మళ్ళీ కంప్యూటర్ కోర్సులు చేసి ఉద్యోగాల వేట ప్రారంభించకూడదని బలంగా అనుకున్నా. ఏదైనా భిన్నంగా చేయాలని, అందరిలో ప్రత్యేకంగా నిలవాలని ఆలోచనతోనే ఎవరూ ఎక్కువగా ఆసక్తి చూపని జియోఫిజిక్స్ను ఎంచుకున్నా. అదే నన్ను ఈ స్థానంలో నిలిపింది. దేశానికే ఏదో ఒకటి చేయాలనే తలంపుతో ఆ అవకాశాన్ని వదులుకున్నా. తప్పు చేస్తున్నావని స్నేహితులు వారించినా కుటుంబ సభ్యుల మద్దతుతో ముందంజ వేశాను. ఆ అవకాశమే వదులుకోకుంటే ఈ క్షణం ఇంత గొప్ప స్థానంలో ఉండేదాన్ని కాదేమో.

కలల ప్రపంచంలో తొలి అడుగు...

శాస్త్రవేత్తలంటే ముందుగా మన కళ్లలో మగవారే మెదులుతారు. నేనూ అదే భావనతో ఉండేదాన్ని, మూడేళ్ళ క్రితం మొదట కార్యాలయంలో అడుగుపెట్టినప్పుడు చాలా భయపడ్డా. సంస్థలోనూ యాభైకి పైగా శాస్త్రవేత్తలు ఉంటే ఆరుగురం మహిళం. ప్రోత్సాహం అందుకుంటూ, ఉత్సాహంగా పోటీ చేయగలనా అని సందేహపడ్డా. త్వరలోనే ఆ ఆలోచలన్నీ చెరిగిపోయాయి. సైన్స్ కి ఆడ మగ తేడా లేదని గ్రహించా. అత్యంత కీలకమైన సునామీ పర్యవేక్షణ విభాగంలో బాధ్యతలు నిర్వహించా.  సముద్ర గర్భంలో తలెత్తే కల్లోలాలు, భూ కంపాలను గమనించడం నిజంగా సాహసంతో కూడినదే. పైగా అత్యంత తీవ్రమైనవి వచ్చినప్పుడు చుట్టు ప్రక్కల వారిని హెచ్చరించడం, కడలి అడుగున సునామీ ఆరంభం కాగానే క్షణాల మీద తెలుసుకునే సాంకేతికతను పెంపొందించడం ఎంతో ప్రయోజనంతో ముడిపడినది. ఒక్కోసారి మేం అందించే సమాచారం ఆస్థి నష్టం జరక్కుండా... కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడుతుంది. దేశానికి ఇంతటి సేవ చేసే అవకాశం ఎప్పటికీ అమూల్యమే. మొదట డీఆర్ డీఎలో ఉద్యోగం సంపాదించాలనుకున్నా. కానీ ఇప్పుడు వారికే మేమిచ్చే సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. వారికి ఆ విధంగా సాయపడగలిగే అవకాశం ఊహించనిది. ప్రస్తుతం జీపీఎస్ ద్వారా సునామీ తరంగాను కనుగొనే అంశం పై పీహెచ్ డీ చేస్తున్న సునంద మరింత ఉన్నత స్థానాలకు ఎదగి, దేశానికి సహాయపడాలని ఆకాంక్షిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Interview with singer usha
Tamil telugu actress laila  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles