Tamil telugu actress laila

Laila,Konkona Sen Sharma,Kim Sharma,Lekha,Leena,Kirat Bhattal,Keerti Reddy,actress,sexy,hot,wallpapers,sex,nude,films,movies,cinema,stills,pics,images,photos

Mumbayi,Laila,Interview,Actress,Laila,tamil-shows, Mumbayil Laila - Interview with Actress Laila, releases, tamil, movie, tamiltorrents, Tamil Movies

tamil telugu actress Laila.GIF

Posted: 02/22/2012 12:26 PM IST
Tamil telugu actress laila

tamil_telugu_actress_Laila2

Lilaఉత్తరాది నుంచి వచ్చి వెండితెరపై వాలిందో కపోతం. తెల్లగా ముచ్చటగా అందంగా ఉంది. దక్షిణాదివారిని చూసి కన్రెప్పలు టపటపలాడించింది. అంతే! ఆ శ్వేతవర్ణపు సోయగాన్ని ‘ఎగిరే పావురమా’ అంటూ తెలుగు ప్రేక్షకలోకం ముద్దు చేసింది. మన ఆప్యాయతకు తను ఎంతో మురిసిపోయింది.తెలుగైనా, తమిళమైనా, మలయాళమైనా వ్యత్యాసం లేదంది. అక్కున చేర్చుకుని, గౌరవాభిమానాలతో ఆదరించిన చోటే తనకు అపురూపమంది. అలా అంటూ, వినోద వినీలాకాశంలో విహరిస్తూనే, మనల్ని మురిపిస్తూనే అకస్మాత్తుగా తెరమరుగయ్యింది. ఎందాక వెళ్లిపోయిందో... ఎక్కడకు ఎగిరిపోయిందో!

‘‘సబ్బులు ఏ చెట్లకు కాస్తాయని ప్రశ్నించేంత అమాయకురాలు నా చిట్టితల్లి. ప్రేమలో పడిందా?’’అంటూ ఆశ్చర్యపోతాడు ‘ఉగాది’ సినిమాలో హీరోయిన్ తండ్రి. నిజమే మరి... ఈ కాలంలో అంతటి అమాయకురాలు ఉంటుందంటే నమ్మలేం. కాని ఆ హీరోయిన్ ముఖం చూస్తే నమ్మేస్తాం. ఇన్నోసెన్స్‌నే తన అందానికి ఎసెన్స్‌ గా మార్చుకున్న ఆ నటి లైలా. హాబీగా మోడలింగ్ చేస్తున్న పదహారేళ్ల ఈ బొంబాయి భామను హిందీ హాస్యనటుడు మెహమూద్ చూడడంతో ఓ అందమైన అమాయకత్వాన్ని భారతదేశ సినీ ప్రేక్షకులంతా చూసే అవకాశం దక్కింది. 1996లో ‘దుష్మన్ దునియాకా’తో తెరకెక్కిన లైలా ఎస్వీ కృష్ణారెడ్డి ‘ఎగిరే పావురమా’తో ఇటొచ్చింది.‘‘సినిమాల్లోకి వస్తే పేరు మార్చుకోవాలా? నేను మార్చుకోను’’అని ప్రకటించి, పేరు మార్చుకోమన్నందుకు పెద్ద సినిమా అవకాశాన్ని సైతం వద్దనుకున్న ఆ పేరు ఇప్పుడెందుకు వినపడడంలేదు?

నాటీ... బ్యూటీ...

సొట్టబుగ్గలు, అమాయకపు చూపులు, చిన్ని ముఖం, ముచ్చటైన నవ్వులు... ముద్దొచ్చే మోము. తెర మీద హీరోయిన్‌ను చూడగానే శివాలెత్తే ‘అదోరకం’ సినీ అభిమానులు కూడా... తమ అలవాటుకు భిన్నంగా ‘‘ఇలాంటి అమ్మాయితో లైఫ్‌లాంగ్ హ్యాపీగా కలసి ఉండొచ్చు’’ అని కలలు కనేలా చేసింది. ఉగాది, ఖైదీగారు, పెళ్లి చేసుకుందాం, పవిత్రప్రేమ, శుభలేఖలు, లవ్‌స్టోరీ 1999, నువ్వేకావాలి (అతిథి పాత్ర) లాంటి పలు తెలుగు సినిమాల్లో నటించింది. బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్రహీరోలతోనూ జట్టు కట్టింది. తమిళ, మలయాళ సినిమాలు పెద్ద సంఖ్యలోనే చేసింది. చిలిపి నటనకు చిరునామాలా అనిపించే ఈ చిన్నది... తమిళంలో నటించిన ఆఫ్‌బీట్ మూవీ ‘పితామగన్’ (తెలుగులో శివపుత్రుడు) లోని పాత్రకు ఫిల్మ్‌ఫేర్, రాష్ట్రప్రభుత్వ ఉత్తమనటి, ఐఎఫ్‌టీఏ అవార్డుల్ని దక్కించుకోవడం విశేషం. లంగా వోణీ కడితే పదహారణాల పల్లె పడతిలా... జీన్స్, టాప్స్ ధరిస్తే సి‘టీనేజర్’లా... ఏ కట్టుతోనైనా ఆ‘కట్టు’కునే ప్రత్యేకత ఈమె సొంతం. బాలీవుడ్‌తో పోలిస్తే బాగా గిట్టుబాటు అవుతుందనే ఆశతో ఇటొచ్చే ఉత్తరాది కథానాయికలకు భిన్నంగా ‘‘దక్షిణాది సినిమాల్లో ప్రొఫెషనలిజమ్ ఉంది. విలువలున్నాయి. నేను హిందీ చిత్రసీమకు ప్రాధాన్యత ఇవ్వదలచుకోలేదు’’ అంటూ చెప్పింది లైలా. అందుకే ఆమె పదేళ్ల కెరీర్‌లో రెండే హిందీ సినిమాలున్నాయి. ‘మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి’ చేశాక, కెరీర్ ఊపులో ఉండగానే మనందరికీ టాటా చెప్పేసిన నవ్వుల దొరసాని ఇప్పుడేం చేస్తోందో!

వన్యప్రాణి హిత...

‘‘వన్యప్రాణులంటే ప్రాణం. యానిమల్ యాక్టివిస్ట్ కావాలనేది నా లక్ష్యం’’ అంటున్నారు ముంబైలోని ఒక ఖరీదైన అపార్ట్‌మెంట్లో నివసిస్తున్న లైలా మెహదిన్. ఈవిడెవరా అని ఆశ్చర్యపోకండి. ఏడేళ్ల పాటు ప్రేమించిన ఇరానియన్ లవర్ మెహదిన్‌ను 2006లో పెళ్లాడిన నాటి అందాల పావురమే ఈమె. ఇష్టసఖుడి సాహచర్యంలో, పండంటి బిడ్డతో హాయిగా ఉన్న తనతో ‘మమ్మల్ని మురిపించిన లైలా... మరోసారి తెరపై కన్పడవేలా?’ అంటే ‘‘పెళ్లయ్యాక నటించనని ముందే చెప్పాగా’’అని గుర్తు చేస్తారు. భర్త, పిల్లాడు ఇదేనా ప్రస్తుత ప్రపంచం? అని ప్రశ్నిస్తే...‘‘డిజిటల్ ఫొటోగ్రఫీ, వయోలిన్ ప్లే, కంప్యూటర్ గేమ్స్’’ అంటూ తన హాబీలు వివరిస్తారు.తన తొలి తెలుగు చిత్రంలో హీరోని ‘కొలబద్ద’’ అంటూ ఆటపట్టించిన ఈ అల్లరి పిల్ల... నిజ జీవితంలోనూ అంతే సందడిగా ఉంటారు. ‘‘నేనో చిలిపి అమ్మాయిని. ప్రపంచానికి సంతోషాన్ని పంచాలని, నా చుట్టూ ఉన్నవారు నవ్వుతూ ఉండాలని ఆశిస్తాను’’ అన్నారామె. నిన్న మొన్నటి వరకు తన నటనతో సినీ ప్రేక్షకులను ఉల్లాసపరిచిన కొంటెనవ్వుల లైలా... ఇక ముందు వన్యప్రాణుల సంరక్షణ కోసం ఉద్యమించాలన్న ఏకదీక్షతో ముందుకు వెళ్లనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  National geoscience awards winner mvsunanda
An exclusive interview with uttar pradesh chief minister mayawati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles