Lagadapati rajagopal and seemandhra movement high tension

seemandhra movement high tension, lagadapati rajagopal fire on kcr, telanganan state, hyderabad issue, congress party, vs tdp,

lagadapati rajagopal and seemandhra movement high tension

సమైక్యాంద్ర ఉద్యమంలో పోటిపడిన పార్టీలు : ఉద్రిక్తత

Posted: 08/10/2013 04:30 PM IST
Lagadapati rajagopal and seemandhra movement high tension

రాష్ట్ర విభజనకు రాజకీయ పార్టీలు పోటీ పడ్డాయని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నిందించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. యువత తలుచుకుంటే ఎంతటివారైనా తల వంచక తప్పదని ఆయన అన్నారు. హైదరాబాద్ ఎవరి సొత్తూ కాదని ఆయన అన్నారు. విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో విజయవాడలోని బెంజి సర్కిల్‌లో జరిగిన శాంతి కవాతును ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత మాట్లాడారు. విభజనకు వ్యతిరేకంగా చట్టసభలను స్తంభింపజేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చాలనే నిర్ణయాన్ని కాంగ్రెసు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ గురించి మాట్లాడుతుంటే ప్రజలు రగిలిపోతున్నారని, హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని ఎలా చెబుతారని, ప్రతి జిల్లాలో ప్రజలు రోడ్లెక్కుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి చట్టసభల్లో ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. కెసిఆర్ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన అడిగారు. సమైక్యాన్ని కాపాడుకుటామని ఆయన అన్నారు.

 

ర్యాలీలో ఉద్రిక్తత

సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో నిర్వహించి ర్యాలీలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు పరస్పరం దూషించుకున్నారు. బాహాబాహికి దిగారు. ఈరోజు ఉదయం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొదట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని ప్రకాశం బ్యారేజి వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మరోవైపు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. కొద్దిదూరం ర్యాలీకి వెళ్లాక టీడీపీ నేతలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. పరస్పరం దూషించుకున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more