Devineni umamaheswara rao fire on congress party leaders

devineni umamaheswara rao fires on congress party, devineni fires on lagadapati, Lagadapati Rajagopal, Vijayawada MP Lagadapati Rajagopal

devineni umamaheswara rao fire on congress party leaders

రాష్ట్ర విభజన పేరుతో డ్రామాలు

Posted: 07/29/2013 05:22 PM IST
Devineni umamaheswara rao fire on congress party leaders

పంచాయతీ ఎన్నికలలో ఎంపీ లగడ పాటి రాజగోపాల్‌, మంత్రి పార్ధసారధి భారీ ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. రెండో దశ ఎ న్నికలలో 237 స్థానాలకు పోలింగ్‌ జరగ్గా 119 స్థానాల్లలో తెలుగుదేశం మద్దతుదారులు గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు ఎన్నికయ్యారని తెలిపారు. ఈమేరకు ఆయన టీడీపీ మద్దతు దారుల జాబితా విడుదల చేశారు. తమ లాగానే తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌లు జాబితా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలలో లబ్ధి పొందటానికి కాంగ్రెస్‌ రాష్ట్ర విభజన పేరుతో డ్రామాలు ఆడుతుందన్నారు. మూలపాడు గ్రామంలో ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ కల్లు తాగిన పిల్లిలా వ్యవహరించారని ఆరోపించారు. మూలపాడు గ్రామంలో గ్రామానికి సంబంధంలేని వారికి ఓటు హక్కు కల్పించడంపై గ్రామస్తుల అభ్యంతరం వ్యక్తం చేశారని దీనిపై వారు ఆందోళన చేశారని తెలిపారు.అయితే ఘర్షణ జరుగుతుందని తెలుసుకుని తాను అక్కడికి వస్తే తనపై క్రిమినల్‌ కేసులుపెట్టాలని లగడపాటి రాజగోపాల్‌ పోలీసు అధికారులపై వత్తిడితేవడం ఎంత వరకు సబబు అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more