Political tamil nadu governor k rosaiah hospitalised

tamil nadu governor k rosaiah hospitalised, rosaiah sick, tamilandu governaor rosaiah, krishna dist, poranki, arya vaisya mahasabha, ex cm rosaiah, political leaders, tamilnadu chief minister jayalalitha,

tamil nadu governor k. rosaiah hospitalised

రోశయ్య అస్వస్థత పై రాజకీయ నాయకులు ఆందోళన.

Posted: 04/23/2013 04:46 PM IST
Political tamil nadu governor k rosaiah hospitalised

ఆంధ్ర్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా పోరంకిలో ఆర్యవైశ్య మహాసభకు రోశయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోశయ్య ప్రసంగిస్తూ వేదికపై అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఎమ్మెల్యే బెల్లంపల్లి ఆయనను స్థానిక రమేష్ ఆస్పత్రికి తరలించారు. రోశయ్య విషయం తెలుసుకున్న రాజకీయ నాయకులు ఆందోళన పడ్డారు. వెంటనే ఆయన ఆరోగ్యం గురించి ఫోన్లు ద్వారా తెలుసుకోవటం చేసినట్లు తెలుస్తోంది. కొంత మంది నాయకులు అయితే ఇప్పటికే విజయవాడ చేరిపోయారు. రోశయ్య ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా రోశయ్య ఆరోగ్య పరిస్థితి పై గాంధీ భవన్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. స్వల్ప అస్వస్థతకు గురైన తమిళనాడు గవర్నర్ రోశయ్య ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, మూడు రోజులుగా విశ్రాంతి లేకపోవడం వల్లే అస్వస్థతకు గురైనట్లు రోశయ్య తెలిపారు. ఈ ఉదయం కృష్ణా జిల్లా పోరంకిలో ఆర్యవైశ్య మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రోశయ్య వేదికపై స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more