Cold war between vijayawada bjp leaders

bjp party, bjp leaders, bjp leaders in vijayawada, cold war between vijayawada bjp leaders, sriram, uma maheswara rao,

Cold war between vijayawada bjp leaders

bjp-leaders.gif

Posted: 03/15/2013 05:38 PM IST
Cold war between vijayawada bjp leaders

Cold war between vijayawada bjp leaders

నగర బీజేపీలో ఎవరికి వారే యమునాతీరే అన్నచందంగా ఉంది. ఇటీవల నగర అధ్యక్ష పదవికి జరిగిన పోటీలో దాసం ఉమామహేశ్వరరాజు, అడ్డూరి శ్రీరామ్‌లు పోటీపడగా, మూడు ఓట్ల తేడాతో శ్రీరామ్ ఓటమి పాలయ్యారు. దీంతో బీజేపీలో రెండు శిబిరాలు ఏర్పడినట్లు చెబుతున్నారు. బీజేపీ కార్యాలయం నుంచి దాసం ఉమామహేశ్వరరాజు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కొంతమందికి సమాచారం ఇవ్వడం లేదని చెబుతున్నారు.  సమాచారం లోపం వల్ల బీజేపీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు కేవలం వేళ్లపై లెక్కించగలిగిన మంది మాత్రమే హాజరవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇందుకు ప్రతిగా అడ్డూరి శ్రీరామ్, పట్నాయక్‌లు వేరొక శిబిరంగా ఏర్పడి వారే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డివిజన్ స్థాయిలో నాయకులు ఉన్నా, వారు కార్యక్రమాలు నిర్వహించే సత్తా ఉన్న వారు కాదని స్పష్టం చేస్తున్నారు. కాగా నగర కమిటీ కూడా ఇంత వరకు ఏర్పడలేదు. ఈ క్రమంలో నగరానికి రాష్ట్ర నాయకుడు ఒకరు పరిశీలకులుగా వస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో ఒంటెత్తు పోకడలపై ఆయన దృష్టిసారించాలని, లేకపోతే పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmana rao dhulipala fire on mp lagadapati
Chicken meat dangerous in vijayawada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more