కార్పొరేషన్‌ను నమ్ముకుని పనులు చేపట్టి, అప్పులపాలైన చిన్న కాంట్రాక్టర్లు నిన్నటి వరకు గొంతెత్తారు. దీనికే కార్పొరేషన్ పరువు నడి బజారులో కలిసింది. చిన్న కాంట్రాక్టర్ల నిరసనలతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చినట్టు నటించినా, నిధులు మాత్రం విదిల్చలేదు. ప్రజా ప్రతినిధులు కూడా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి మరింత జఠిలం అయింది. ఇప్పటి వరకు కొన్ని సందర్భాలలో మాత్రమే నోరు తెరిచిన కార్పొరేషన్ బడా కాంట్రాక్టర్లు ఇప్పుడు బిల్లులు చెల్లిస్తారా? లేదా? అంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారులపై పక్షం రోజులుగా లేఖాస్త్రాలు సంధిస్తూ ఒత్తిళ్ళు తెస్తున్నారు. ఈ పరిణామం కార్పొరేషన్‌ను మరింత ఇరుకున పెడుతోంది. జేఎన్ఎన్‌యూఆర్ఎం పనులు చేపట్టిన బడా కాంట్రాక్టర్లలో ఎక్కువ మంది హౌసింగ్ కాం ట్రాక్టర్లే ఇప్పుడు ఒత్తిడి తెస్తున్నారు. గతంలో ఒక్కసారి హౌసింగ్ కాంట్రాక్టర్లు తమ బకాయిల విషయంలో జేఎన్ఎన్‌యూఆర్ఎం ఇళ్ళకు తాళాలు వేశారు. ఈ విషయాన్ని అప్పట్లో 'ఆంధ్రజ్యోతి' వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాత హడ్కో నుంచి తీసుకున్న అప్పు, తర్వాత క్రమంలో విడుదలైన గ్రాంటు నుంచి కొంత సర్దుబాటు చేయటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
దీర్ఘకాలం బిల్లులు చెల్లించకపోవటంతో కార్పొరేషన్ అధికారులపై క్రమేణా బడా కాంట్రాక్టర్లు ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం హౌసింగ్ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయే రూ.62.52 కోట్లు ఉంది. కొద్ది రోజుల క్రితం కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వం నుంచి నిధులు పొందటానికి జేఎన్ఎన్‌యూఆర్ఎం మిగులు పనులకు సంబంధించిన యాక్షన్ ప్లాన్స్‌ను రూపొందించారు. అయినప్పటికీ ప్రభుత్వం కనికరించలేదు. ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం లేదు. దీనితో బడా కాంట్రాక్టర్లు ఒత్తిడి పెంచుతున్నారు. ఒకవేళ తమకు బిల్లులు చెల్లించలేని పక్షంలో, సీరియస్‌గానే వ్యవహరించాలని వారు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే పరిస్థితిని కార్పొరేషన్ ఎలా చక్కదిద్దగలుగుతుందన్నదే ప్రశ్నగా ఉంది.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more