బాస్కెట్‌బాల్ క్రీడలో జాతీయస్థాయిలోనే నూజివీడుకు ఓ ప్రత్యేక స్థానముంది. ఆక్రో బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏటా ఇక్కడ జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొంటారు. ఇందులో భాగంగా ఇవాళ(గురువారం) 37వ బాస్కెట్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. నూజివీడులోని ధర్మఅప్పారావు(డీఏఆర్) కళాశాల క్రీడాప్రాంగణంలో ఫ్లడ్‌లైట్ల వెలుగులో నేటి నుంచి నాలుగు రోజులపాటు జరిగే బాస్కెట్ బాల్ పోటీలు క్రీడాభిమానులకు కనువిందు చేయనున్నాయి.
పురుషులు, మహిళ విభాగంలో జరిగే పోటీలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 71 జట్లు ఇప్పటికే తమ ఎంట్రీలు నమోదు చేసుకున్నాయి. 37 సంవత్సరాల పాటు నిర్విరామంగా బాస్కెట్ బాల్ పోటీలను నిర్వహిస్తున్న ఘనత నూజివీడుకే దక్కుతుంది. ఏటా ఈ పోటీలకు సుమారు రూ. 3.50 లక్షలు వరకు ఖర్చవుతుండగా... ఈ ఏడాది మాత్రం రూ.6లక్షల వరకు ఖర్చవుతున్నట్లు నిర్వాహకులు అంచనా వేశారు. తొలి నుంచి క్రీడాభిమానులు, దాతల నుంచి అందే విరాళాలతోనే పోటీలను నిర్వహించడం గమనార్హం.
ఇక ఈ టోర్నీ పుట్టుపూర్వత్రాలను పరికిస్తే, మాజీమంత్రి, ఆంధ్రా వర్సిటీ వైస్ ఛాన్సలర్‌తో పాటు పలు ఉన్నత పదవులు అధిష్టించిన దివంగత ఎమ్మార్ అప్పారావు అధ్యక్షునిగా, ఎంఎస్ అప్పారావు కార్యదర్శిగా 1969లో నూజివీడు బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆవిర్భవించింది. 1971లో తొలిసారిగా డీఏఆర్ కళాశాల్లో ఆంధ్రా బాస్కెట్ బాల్ సంఘం ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. 1973లో ఎంఎస్ అప్పారావు సారథ్యంలో ఆక్రో బాస్కెట్ బాల్ సంఘం ఏర్పాటైంది. 1975లో చిత్తూరులో జరిగిన ఆంధ్రా చాంపియన్ షిప్ పోటీల్లో పురుషులు, మహిళల విభాగాల్లో నూజివీడు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబర్చి ప్రథమస్థానాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో ఈ క్రీడను మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎమ్మార్ అప్పారావు నేతృత్వంలో నూజివీడు కేంద్రంగా జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఏర్పాటైంది. ఇక్కడ ఉన్నత ఆటతీరు ప్రదర్శించిన ఎందరో అత్యున్నత స్థానాలకు చేరటం విశేషం.
...avnk
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more