Music director keeravani gets award

music director keeravani gets award, telugu film music director mm meeravani, keeravani music, occational excellence award for keeravani, vijayawada rotary club give award for keeravani, keeravani album, vijayawada rotary club functions

music director keeravani gets award

17.gif

Posted: 11/05/2012 03:42 PM IST
Music director keeravani gets award

M-M-Keeravaniee

సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి విజయవాడ మిడ్ టౌన్ రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్స్‌ లెన్స్ అవార్డును అందజేసింది.  కృష్ణా కరకట్ట పై ఉన్న విజయవాడ క్లబ్‌లో మెమెంటో ఇచ్చి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేక్షకుల మదిలో పది కాలాలపాటు నిలిచి ఉండే పాటలు అందించేందుకు నిరంతరం సంగీత సాధన చేస్తున్నట్లు తెలిపారు. తనకు అవార్డులు ఆనందాన్నిస్తాయని, జనంతో మమేకమవడం అంతకంటే సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. తమలాంటి వారిని ప్రోత్సహించడంతోపాటు పేదలకు రోటరీ క్లబ్ చేస్తున్న కార్యక్రమాలు ఆకట్టుకోవడంతోనే ఇక్కడికి వచ్చానన్నారు. సమావేశానికి వచ్చిన వారి కోరిక మేరకు ఆయన కొన్ని పాటలు పాడారు. క్లబ్ తరఫున ఏటా ఒక్కో రంగంలో రాణించిన వారికి ఈ అవార్డు అందజేస్తారు.

       ఇక్కడి సభలో కీరవాణి ఓ తమాషా లెక్చర్ ఇచ్చారు. అదేంటంటే.. 'మాతృదేవోభవ' సినిమాలో కీరవాణి పాడిన 'రాలిపోయే పువ్వా... నీకు ... రాగాలెందుకే' పాట ఎంతో మందికి ఫేవరైట్ సాంగ్ అయిపోయింది. పలు ఫంక్షన్లలో కీరవాణి చేత ఈ పాటను గతంలో చాలామంది అడిగి మరీ పాడించుకునేవారు. అయితే.. యన్టీఆర్ కి ఈ పాట అంటే ఎంతో ఇష్టమట. తన మనసు బాగోలేనప్పుడు, డిప్రెస్సివ్ గా వున్నప్పుడూ ఈ పాటను యన్టీఆర్ ఎన్నోసార్లు వింటుంటాడనీ, దాంతో అతను వెంటనే రిఫ్రెష్ అవుతానని ఆ మధ్య ఓ ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ తెలిపాడు.  ఇక అప్పట్నుంచీ ఆ పాటను యన్టీఆర్ కే ఆయన కేటాయించిపెట్టేశారు. అంటే, కేవలం యన్టీఆర్ సమక్షంలో జరిగే ఫంక్షన్లలో మాత్రమే ఈ పాటను కీరవాణి పాడతారన్నమాట. ఇక్కడ కీరవాణికి జరిపిన సన్మాన సభలో, ప్రేక్షకులు ఈ పాట పాడమని కీరవాణిని కోరగా... ఆయనీ విషయం వెల్లడించారు. అదీ సంగతీ...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Union minister chiranjeevi krishna district tour
Squirrel farewell in krishna district  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more