Vaccination for hajj pilgrims

Vaccination for Hajj pilgrims, congress core committee, hajj yatra 2013,

Vaccination for Hajj pilgrims

ఢిల్లీకి మేధావి వర్గం-ముస్లిం సోదరులకు వ్యాక్సిన్లు

Posted: 09/21/2013 05:36 PM IST
Vaccination for hajj pilgrims

రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాన్ని ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు తిరుపతి నుంచి మేధావి వర్గం ఢిల్లీకి పయనమైంది. తిరుపతిలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన ప్రముఖులు, ఉన్నత విద్య విభాగాల అధిపతులు, వైద్యులు ఒక కమిటీగా ఏర్పాడి ఇవాల తెల్లవారుజామున ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్రపతి, ప్రధాని, కాంగ్రెస్ కోర్ కమిటి సభ్యులతోపాటు ప్రతిపక్షపార్టీల నేతలను కలవడానికి అనుమతి కోరుతూ ఉత్తరాలు రాసినట్లు తెలిపారు. ఈ నెల 24 వరకు ఢిల్లీలో ఉండి రాష్ట్ర విభజనతో కలిగే నష్టాలను వివరించనున్నారు.

 

ముస్లీం సోదరులకు వ్యాక్సిన్లు

హజ్ యాత్రకు వెళ్లే జిల్లాకకు చెందిన ముస్లిం సోదరులకు ఆదివారం వ్యాక్సిన్లు వేయనున్నట్లు హజ్ కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం స్థానిక రాయల్ చెరువు రోడ్డులోని షాదీమహాల్ లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచితంగా వ్యాక్సిన్లు వేస్తారు. శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, రేణిగుంట, తిరుపతి నుంచి హజ్ యాత్రకు వెళ్తున్న అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలాని వారు కోరారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles