Samaikya jac demands kavuri sambasiva rao resignation

Samaikya JAC demands Kavuri Sambasiva Rao Resignation, Balakrishna Visits Tirupati With New Couple, Balakrishna visits Tirupati, Kavuri Sambasiva Rao

Samaikya JAC demands Kavuri Sambasiva Rao Resignation, Samaikya JAC demands Kavuri Resignation, Balakrishna Visits Tirupati With New Couple

కావూరిని తాకిన సమైక్య.. బాలయ్య అభిషేకం..

Posted: 08/23/2013 04:37 PM IST
Samaikya jac demands kavuri sambasiva rao resignation

కేంద్రం మంత్రి కావూరి సాంబశివరావు ఈరోజు తన కుటుంసభ్యులతో శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకునేందుకు వెళ్లారు. అయితే దర్శనం అనంతరం తిరిగి వెళ్లే సమయంలో ఆలయ ఆవరణలో రాజకీయ ఉద్యోగ ఐకాస సభ్యులు మంత్రిని అడ్డగించి తక్షణమే ఆయనను రాజీనామా చేయ్యాలని డిమాండ్ చేశారు. అయితే కావూరి మాట్లాడుతూ సమైక్యాంద్ర కోసం నాలుగేళ్లుగా శ్రమిస్తున్నానని ఇప్పటికి తాను సమైక్యవాదినేనని చెప్పారు.

రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రలో ఉద్యమం ఉదృతమవుతుందని హైకమాండ్‌కు చెప్పామన్నారు. సీమాంధ్రలో పరిస్థితులను ప్రధాని, సోనియా, ఆంటోని కమిటీకి వివరించామని తెలిపారు. సానుకూల స్పందన రాకపోతే రాజీనామాలు చేస్తామని ఆయన తెలిపారు. సమైక్యాంధ్ర కోసం ఏపీ ఎన్జీవోలు చేపట్టిన సమ్మె సమర్థనీయమని కావూరి అన్నారు.శ్రీవారిని రోజు ఉదయం కుటుంబ సమేతంగా కేంద్ర మంత్రి కావూరి శ్రీవారిని దర్శించుకున్నారు

 

శ్రీవారి అభిషేక సేవలో బాలయ్య

తిరుమల శ్రీవారిని నూతన దంపతులు శ్రీభరత్, తేజస్వినిలతో కలిసి సినీనటుడు నందమూరి బాలయ్య దర్శించుకున్నారు. ఈ వేకువజామున స్వామివారి అభిషేక సేవలో నూతన దంపతులతో కలిసి బాలయ్య పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి బాలయ్య, నూతన దంపతులను శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. బాలయ్యను చూసేందుకు ఆలయం వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles