Cheetah died in a road accident in tirumala ghat

Cheetah Died In a Road Accident In Tirumala Ghat, Tirumala Ghat Road Cheetah Dead in Accident

Cheetah Died In a Road Accident In Tirumala Ghat, Tirumala Ghat Road Cheetah Dead in Accident

తిరుమల చిరుత – ముమ్మరంగా..

Posted: 08/22/2013 06:22 PM IST
Cheetah died in a road accident in tirumala ghat

తిరుమల కనుమరహదారిలో ఈ రోజు తెల్లవారుజామున చిరుత మరణించింది. నాలుగో కిలోమీటరు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఘటన జరిగింది. చిరుత పులి మ్రుతదేహాన్ని పరిశీలించేందుకు అటవీశాఖ అధకారులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

 

విజయవంతం

రాష్ట్ర విభజనను నిరసిస్తూ పీలేరులో ఐకాస పిలుపునిచ్చిన బంద్ విజయవంతమైంది. ఉదయం 5 గంటల నుంచి ఉద్యమకారులు నాలుగు రోడ్ల కూడలివద్ద వాహనాలను నిలిపివేశారు. రెవెన్యూ శాఖ ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. న్యాయవాదుల సంఘం, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం, భవన నిర్మాణ కార్మికుల సంఘం , పెయింటింగ్ కార్మికుల సంఘం, ఉపాధ్యాయ సంఘాల ఆద్వర్యంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వమించారు. దీంతో నాలుగు రోడ్ల కూడలి వద్ద లారీలు మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. లారీ చోదకులు సైతం భోజనాల్లేకుండా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 

ముమ్మరంగా

తంబళ్లపల్లి నియోజక వర్గంలోని బి. కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, ములకచెర్వు, కురబళకోట, పెద్ద మండ్యం మండలాల్లో ఉపాద్యాయ జేఏసీ ఆద్వర్యంలో సమైక్యాంద్ర ఉద్యమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఉపాధ్యాయలు, విద్యార్థులు, రాజకీయ జేఏసీ పక్షాలు ర్యాలీలు, రాస్తారోకోలు, రోడ్లపైనే చదువులు కొనసాగించి నిరసన తెలిపారు.

 

సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 7 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన వచ్చిన భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 48,825 మంది భక్తులు దర్శించుకున్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles