Ap jawan vinayakam dies in iaf copter crash

AP jawan Vinayakam dies in IAF copter crash, AP jawan Vinayakam, Army jawan from AP killed in Gaurikund chopper crash,

AP jawan Vinayakam dies in IAF copter crash

హెలికాఫ్టర్ ప్రమాదంలో చిత్తూరు వాసి వినాయకం మృతి

Posted: 06/27/2013 04:43 PM IST
Ap jawan vinayakam dies in iaf copter crash

ఉత్తరాఖండ్ వరద బాధితులకు సహాయం అందించే హెలికాఫ్టర్ కూలిన ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన వినాయకం అనే సైనికుడు మృతిచెందాడు. జిల్లాలోని పూతపట్టు మండలం చినబండపల్లి గ్రామానికి చెందిన కృష్ణస్వామి, రాణెమ్మల మూడో సంతానం వినాయకం. నిరుపేద కుటుంబానికి చెందిన వినాయకం 2008 లో ఇండియన్ ఆర్మీలో చేరారు. గత 20 రోజుల క్రితమే తమ కుమారునికి వివాహ నిశ్చయం జరిగిందని, సెప్టెంబర్ 9 న వివాహం చేయాలని నిర్ణయించామని ఇంతలోనే అతని మరణ వార్త వినాల్సివస్తుందని తాము అనుకోలేదని వినాయకం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వినాయకం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని ఐటిబిటి నాల్గవ బెటాలియన్ అధికారులు తెలిపారు. అధికార లాంఛనాలతో అతని అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. వినాయకం మృతితో చినబండపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.    

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles