Solar lights in tirupathi

Solar Lights in Tirupathi, ttd, tirumala devastanam, sri venkateswara swami temple, tirupathi, solar lights,

Solar Lights in Tirupathi

టీటీడీలో సౌర వెలుగులు

Posted: 06/18/2013 11:53 AM IST
Solar lights in tirupathi

తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం, సెంట్రల్ ఆస్పత్రి, అనెక్స్ భవనాల్లో ఇక సౌర వెలుగులు విరజిమ్మనున్నాయి. పరిపాలనా భవనం ప్రాంగణంలోని వీధి దీపాలకు కూడా సౌరవిద్యుత్‌నే ఉపయోగించనున్నారు. సంప్రదాయేతర ఇంధనవనరుల అభివృద్ధిలో భాగంగా టీటీడీ సొంతంగా సౌరవిద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టింది. ఇందుకోసం రూ.1.25 కోట్లతో 100 కిలోవాట్ల సామర్థ్యం గల సౌరవిద్యుత్ ప్లాంటు పనులు పూర్తి కావచ్చాయి. చెన్నైకి చెందిన ఎల్‌అండ్ టీ లిమిటెడ్, ఏయోన్ రెనెవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్, క్రక్స్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ సంస్థల సహకారంతో విరాళంగా వచ్చిన సౌర విద్యుత్ పరికరాలు సమకూర్చుకున్నారు. ప్లాంట్ ఏర్పాటులో వీరి సహకారం తీసుకున్నారు.

టీటీడీ పరిపాలనా భవనానికి సుమారు 600 కిలోవాల్టుల విద్యుత్ అవసరమవుతోంది. ఇందులో 200 కిలోవాల్టులు వెలుతురు కోసం కాగా, మిగతా విద్యుత్ కార్యాలయ పనులకు వినియోగిస్తున్నారు. కేంద్రీయ వైద్యశాల, అనెక్స్ భవనం అసవసరాలకు నెలకు 1.2 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. ఇందుకోసం నెలకు రూ.8.40 లక్షలు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌర విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేసి విద్యుత్ ఖర్చును తగ్గించుకోవాలని టీటీడీ నిర్ణయించింది. దాతలు ముందుకు రావడంతో వారిచ్చిన విరాళాలతోనే ప్లాంటును నెలకొల్పింది. ఈ ప్లాంటుకు అయిన మొత్తం ఖర్చు రూ.1.25 కోట్లు. ఎల్‌అండ్‌టీ రూ.75 లక్షల విలువైన పరికరాలు, ఏయోన్ రెనెవబుల్‌ఎనర్జీ, క్రక్స్ ఇండస్ట్రీస్ కలిపి రూ.50 లక్షల విలువైన 50 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సౌర ఫలకాలు, విరాళంగా అందించాయి. ఈ ప్లాంటు నుంచి సంవత్సరానికి రూ.10.50 లక్షల విలువైన సుమారు 1.50 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్లాంటు కాలపరిమితి 25 ఏళ్లు. ఈ సౌరవిద్యుత్ ప్లాంటు ఏర్పాటుతో సంవత్సరానికి 100 టన్నుల కార్బన్ ఉద్గారాలు వాతావరణంలో కలవకుండా పర్యావరణాన్ని పరిరక్షించినట్లు అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles