Political cm kiran kumar reddy speech at pileru in chittoor district

cm kiran kumar reddy, cm kiran kumar reddy speech at pileru, congress party, chittoor district,

CM Kiran Kumar reddy speech at Pileru in Chittoor district

పీలేరులో ముఖ్యమంత్రి

Posted: 05/27/2013 02:54 PM IST
Political cm kiran kumar reddy speech at pileru in chittoor district

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి నేడు ఉదయం 8.30కి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ అల్పాహారం తీసుకుని కొద్దిసేపు విరామం తర్వాత 9.30 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా పీలేరు డిగ్రీ కళాశాలనందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ చేరిన ముఖ్యమంత్రితో అధికార, అనధికారులు కలుసుకోవడానికి కొంత సమయాన్ని వెచ్చించడం జరుగుతుంది

వారితో పిచ్చాపాటి చర్చించిన తర్వాత 10.05 గంటలకు బస్సులో బయలుదేరి 10.10 గంటలకు పీలేరు షాదీమహల్‌ చేరుకుని మైనారిటీ విద్యార్దుల హాస్టల్‌ భవనాలకు శంకుస్థాపన చేస్తారు. 10.20కి బయలుదేరి 10.25కు పీలేరు తహశీల్దారు కార్యాలయం చేరుకుని శ్రీచెన్నకేశవ స్వామి ఆలయాభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన, అక్కడే ఏర్పాటు చేసిన తహశీల్దారు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

10.40కి బయలుదేరి 10.45కు సాంఘిక సంక్షేమ శాఖ వాణిజ్య సముదాయం చేరుకుని 33-11 కెవి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ,ట్రాన్స్‌కో డివిజన్‌ కార్యాలయాలన్ని ప్రారంభిస్తారు. సాంఘిక సంక్షేమ శాఖ వాణిజ్య సముదాయం ప్రారంభిస్తారు. 33-11 కె.వి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌, బాలికల జూనియర్‌ కళాశాల, ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాల, 100 పడకల ఆసుపత్రి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.

ప్రజలతో ముఖాముఖి కార్యక్రమ అనంతరం 11.05కు బయలుదేరి కలి కిరి మార్కెట్‌ యార్డు చేరుకుని యార్డును ప్రారంభిస్తారు. 11.40కి బయలుదేరి కలికిరి వద్ద రోడ్లు, భవనాలశాఖ అతిథి గృహం చేరుకుని అతిథి గృహాన్ని ప్రారంభిస్తారు. 11.50కి బయలుదేరి కలికిరి చేరుకుని 100 పడకల ఆసుపత్రి భవనాలకు, పశు విజ్ఞాన కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక సంస్థ హరిత రిసార్టుకు, 400 కె.వి విద్యుత్‌ ఉప కేంద్రాన్ని, 33-11 కె.వి ఉప కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. తుమ్మలపేట, మహల్‌, పారపట్లకు సంబంధించి శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం 12.10కి కలికిరి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల చేరుకుని కళాశాలను ప్రారంభిస్తారు. 12.20కి బయలుదేరి కలికిరి జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్‌ యూనివర్శిటీ చేరుకుని జె.ఎన్‌.టి.యు.కు శంకుస్థాపన చేస్తారు. 12.35కు బయలుదేరి ముఖ్యమంత్రి తన నివాసం చేరుకుంటారు.

భోజన విరామం తర్వాత 3 గంటలకు బయలుదేరి చింతపర్తి మార్కెట్‌ యార్డు చేరుకుని మార్కెట్‌ యార్డును ప్రారంభిస్తారు. 3.40కి బయలుదేరి వాయల్పాడు ఇందిరమ్మమ కాలనీ చేరుకుని కాలనీని ప్రారంభిస్తారు. 3.50కి బయలుదేరి వాయల్పాడు మార్కెట్‌ యార్డు చేరుకుని యార్డును , తహశీల్దారు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 100 పడకల ఆసుపత్రికి ఎం.పి.డి.ఓ కార్యాలయం, వారపు మార్కెట్‌, సబ్‌ జైలు, 33-11 కె.వి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు శంకుస్థాపన చేస్తారు. బాలికల ఉర్దూ జూనియర్‌ కళాశాల , ఉర్దూ గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేస్తారు.

సాయంత్రం 4.35కు బయలుదేరి తరిగొండ చేరుకుని వాయల్పాడు నుంచి గుర్రంకొండకు రోడ్లు, భవనాల రహదారిని ప్రారంభిస్తారు. దర్గాకు కూడా శంకుస్థాపన చేస్తారు. 4.55కు బయలుదేరి గుర్రంకొండ మార్కెట్‌ యార్డు చేరుకుని మార్కెట్‌ యార్డును ప్రారంభిస్తారు. 5.30కి బయలుదేరి గుర్రంకొండవద్దనున్న ఇందిరమ్మ కాలనీ ప్రారంభిస్తారు. షాదీమహల్‌, స్టేడియం, ఉర్దూ జూనియర్‌ కళాశాల, తెలుగు జూనిియర్‌ కళా శాల, 33-11 కె.వి విద్యుత్‌ సబ్‌ స్టేషన్లకు శంకుస్థాపనలు చేస్తారు. 6 గంటలకు బయులుదేరి 7 గంటలకు ముఖ్యమంత్రి నివాసం చేరుకుంటారు. ఆ రాత్రికి అక్క డే బసచేస్తారు. తిరిగి 28వ తేదిన మధ్యాహ్నం 1.45కు హెలికాప్టర్‌లో బయలుదేరి 2.20కి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని 2.30కి విమానంలో హైదరాబాద్‌ బయలుదేరి వెళతారని జిల్లాకలెక్టర్‌ సాల్మన్‌ ఆరోగ్యరాజ్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles