Ttd srivari vasanthotsavam annual festival 2013

ttd srivari vasanthotsavam, ttd srivari, ttd, tirumala temple, lord sri venkateswara swamy, annual festival vasanthotsavam, vasanthotsavam annual festival 2013

TTD Srivari Vasanthotsavam Annual Festival 2013

కల్యాణ వెంకన్న వసంతోత్సవాలు

Posted: 05/27/2013 02:59 PM IST
Ttd srivari vasanthotsavam annual festival 2013

నివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వసంతోత్సవాలు ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి వెనుకవైపున స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజన సేవను నిర్వహించేందుకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు.

అలాగే ఆలయం ముందు అందమైన రంగవల్లులు వేయిస్తున్నారు. మంగళవారం ఉదయం దైనందిన పూజా కార్యక్రమాలను యథావిధిగా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్ సేవ, తిరువీధుల ఉత్సవం నిర్వహించనున్నారు.

29న ఉదయం శ్రీవారి ఉత్సవ మూర్తులు వసంతమండపానికి వేంచేపు, ఆస్థానం నిర్వహించనున్నారు. 30న ఉదయం 8.30గంటల నుంచి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు, సీతాసమేత శ్రీరామ, లక్ష్మణులు, రుక్మిణీ, సత్య భామ సమేత శ్రీకృష్ణుడు, ఆంజినేయుని ఉత్సవ మూర్తులను వసంత మండపానికి తీసుకువెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలు, కల్యాణోత్సవం రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles