Tirumala venkateswara swamy dwajarohanam

tirumala venkateswara swamy, dwajarohanam, tirumala-tirupati devasthanams, ttd, sri padmavathi devi, venkateswara swamy kalyana mahotsavam

tirumala venkateswara swamy dwajarohanam

వైభవంగా వెంకన్న ధ్వజారోహణం

Posted: 05/23/2013 10:54 AM IST
Tirumala venkateswara swamy dwajarohanam

మండల కేంద్రంలోని పద్మావతీ సమేత కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమైయ్యాయి. రాత్రి స్వామివారు ఉభయ నాంచారులతో పెద్దశేషవాహంపై తిరువీధి ఉత్సవంలో భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి సుప్రభాతం, తోమాల సేవ, ఆలయ శుద్ధి, అర్చన నిర్వహించారు. అనంతరం ఆలయం లో నిర్వహించిన స్వామివారి ఆస్థానానికి స్థానిక వీరరాఘవ స్వామి ఆలయ ధర్మకర్త మోపూరి కన్నయ్య ఆధ్వర్యంలో పట్టు నూలు సాలీలు వస్త్రాలను సమర్పించారు. ఉదయం 7.30 గంటలకు చక్రాళ్వార్, సేనాపతి విష్వక్సేనుడు, గరుడాళ్వార్ చిత్రపటమున్న వస్త్రంతో తిరుచ్చి వాహనంపై ఉభయ నాంచారులతో స్వామివారు మాడవీధుల్లో ఊరేగారు.

తరువాత స్వామివారు వాహన మండపంలో కొలువు తీరారు. 9.30 గంటలకు కర్కాటక లగ్నంలో ఆలయ అర్చకులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య గరుడాళ్వార్ చిత్ర పటమున్న వస్త్రాన్ని ధ్వజస్తంభానికి అధిరోహింపజేశారు. స్వామివారి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ జరిపారు. రాత్రి స్వామివారు పెద్ద శేషవాహనంపై పురవీధులలో విహరిం చారు. వాహనసేవ మొదటిసారిగా ఏనుగులు, వృషభాలు, అశ్వ దళాల మధ్య సాగింది. మహిళలు, భక్తులు హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి 10.30 గం టలకు ఏకాంత సేవ నిర్వహించారు. ఆలయా న్ని, మాడవీధులను టీటీడీ విద్యుత్ శాఖ సిబ్బంది దీపాలతో అలంకరించారు. స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో భాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్ పీతాంబరరాజు, ఆలయాధికారి బాలనరసింహరావు తదితరులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles