Fake police arrest in tirupati

fake police arrest in tirupati, krishnaiah, bimarao, venugopal, bike sales, tirupathi crime police, dsp swami,

fake police arrest in tirupati

తిరుపతిలో నకిలీ పోలీస్ అరెస్టు

Posted: 05/03/2013 07:05 PM IST
Fake police arrest in tirupati

 బైక్‌లు అపహరించి.. పోలీసులు సీజ్ చేసినవంటూ అమ్మేస్తాడు. ఇలా నకిలీ పోలీసు అవతారమెత్తిన అరవ కృష్ణయ్య అలియాస్ భీమారావు ను, అతడి సహాయకుడు వేణుగోపాల్‌ను తిరుపతి క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 35 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ స్వామి వెల్లడించారు. ఆ ప్రకారం.. పుత్తూరు మండలం నంది మంగళంకు చెందిన కృష్ణయ్య అలియాస్ భీమారావు పోలీస్‌నంటూ కొంతకాలంగా చలామణీ అవుతున్నాడు. తిరుపతి అశోక్‌నగర్‌కు చెందిన వేణుగోపాల్‌ను సహాయకుడిగా పెట్టుకుని రెండేళ్లుగా చిత్తూరు, కడప ప్రాంతాల్లో 35 బైక్‌లను దొంగిలించాడు. తన బైక్‌కు ముందు, వెనుక భాగంలో 'పోలీస్' స్టిక్కర్ వేసుకుని ఇంజినీరింగ్ విద్యార్థులు, ఇతరులకు కానిస్టేబుల్‌నని పరిచయం చేసుకుంటాడు. పోలీసులు సీజ్ చేసిన బైక్‌లని వారిని నమ్మిస్తాడు. ఆ తర్వాత రికార్డులు ఇస్తామంటూ అమ్మేస్తాడు. గతంలో ఇతడు పుత్తూరు పోలీసులపై తిరగబడి అసాల్ట్ కేసులో ఉన్నాడు. ఈ బైక్‌ల దొంగతనానికి పుత్తూరు మిద్దిగుంటకు చెందిన రూపేష్ కూడా వీరికి సాయం చేసేవాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న రూపేష్ వద్ద కూడా కొన్ని బైక్‌లు ఉన్నాయి. అరెస్టయిన కృష్ణయ్య, వేణుగోపాల్‌ను  తిరుపతిలో అరెస్టు చేసి 35 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles