No new trains for tirupati

No new trains for tirupati

No new trains for tirupati

trains not available for tirupati.png

Posted: 12/28/2012 06:44 PM IST
No new trains for tirupati

పాకాల-ధర్మవరం రైలు మార్గాన్ని మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్‌గా మార్చినా ప్రయాణికులకు అవసరమైనన్ని రైళ్లు ప్రారంభానికి నోచుకోకుండా పోతున్నాయి. మూడేళ్ల క్రితం 227 కిలోమీటర్ల మార్గాన్ని మీటర్‌గేజ్ నుంచి బ్రాడ్‌గేజ్‌గా మార్చేందుకు రూ.657 కోట్లను ఖర్చు చేశారు. పాకాల-ధర్మవరం మార్గం మీదుగా హైదరాబాదుకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువ. బ్రాడ్‌గేజ్‌కు ముందు తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ నడిచేది. 2010లో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు పునరుద్ధరించినప్పటికీ కొత్తగా ప్రయాణికులకు కలిగిన వెసులుబాటు నామమాత్రమే. రూ.657కోట్లు ఖర్చుచేసి బ్రాడ్‌గేజ్ మార్గం ఏర్పాటు చేసినా ఇందుకు తగ్గట్టు రైళ్ల సంఖ్య పెరగలేదు. ప్రతిరోజూ తిరుపతి నుంచి గుంతకల్లుకు పగటివేళ రెండు, గుంతకల్లు నుంచి తిరుపతికి రాత్రివేళ రెండు ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి.

12731 పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి మంగళ, బుధవారాల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, 12732 పద్మావతి ఎక్స్‌ప్రెస్ బుధ, గురువారాల్లో తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు నడుస్తోంది. సికింద్రాబాదు నుంచి వికారాబాద్, రాయచోటి, గుత్తి, ధర్మవరం, మదనపల్లె రోడ్డు, పీలేరు, పాకాల మీదుగా తిరుపతి చేరుతాయి. ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న రైళ్లు ఇవి మాత్రమే. కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన సికింద్రాబాద్-తిరుపతి(12770) రైలు ఇటీవల ప్రారంభం అయ్యింది. ఇది మంగళ, శనివారాల్లో మాత్రమే నడుస్తుంది. తిరుపతి, చంద్రగిరి, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలకు చెందిన ప్రయాణికులతో పాటు అనంతపురం జిల్లాలోని కదిరి, నల్లమాడ, ధర్మవరం నియోజకవర్గాల ప్రయాణికులు హైదరాబాద్‌కు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రైలును ప్రతిరోజూ నడి పితే ఉపయోగకరంగా ఉంటుందని పలువు రు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu mahasabhalu 3rd day
President of india to start telugu mahasabhalu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles