ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని రూయా ప్రభుత్వ ఆస్పత్రి లో ఓ ఫేక్ డాక్టర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు తిరుపతిలోని రుయా ఆస్పత్రి సిబ్బంది. నాలుగేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నా, ఎవరికీ అనుమానం రాలేదు. అధికారులే పరోక్షంగా నకిలీ డాక్టర్‌ను సృష్టించారని తెలుస్తోంది. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో నాలుగేళ్లుగా హౌస్‌సర్జన్‌గా కొనసాగుతున్న నకిలీ డాక్టర్ అలేఖ్యను పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఆమె కొలీగ్స్. వివరాల్లోకి వెళితే.... 2006లో ఎస్వీ మెడికల్ కాలేజీలో ముంతాజ్ అనే విద్యార్థినికి సీటు వచ్చింది. అయితే జాయిన్ అయిన కొద్ది రోజులకే ఆమె మృతిచెందడంతో.. ఆ స్థానంలో అలేఖ్య చేరినట్లు తెలుస్తోంది. అడ్డదారిలో, లంచం ఇచ్చి సీటు పొందినట్లు అలేఖ్యపై ఆరోపణలు ఉన్నాయి. నిత్యం ఆస్పత్రి నుంచి పెద్దఎత్తున మందులు, రోగులను తరలిస్తుండటంతో అనుమానం వచ్చిన సహచర వైద్యులు కూపీ లాగారు. అంతే.. డొంకంతా కదిలింది. అలేఖ్య ఫేక్ డాక్టర్‌గా తేలిపోయింది.అసలు 2006 నుంచి ఆ పేరుతో ఎవరూ జాయిన్ కాలేదని ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ చెప్తున్నారు. మొత్తానికి నకిలీ డాక్టర్ అలేఖ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more