Whatsapp users be careful

Whatsapp users be careful

whatsapp, hacking, Hackers, Social Media, Tip of the day, Tips, Tips for social media use

Social media Whatsapp users becareful about the technology. Whatsapp facing hacking problem. So please becareful and implement these tips.

వాట్స్‌యాప్‌ వాడుతున్నారా..? ఐతే జర భద్రం

Posted: 12/05/2015 10:19 AM IST
Whatsapp users be careful

వాట్స్‌యాప్‌... ఇది తెలియని స్మార్ట్ ఫోన్ యూసర్ లేదంటే అతిశయోక్తి లేదు. మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులు చాలా సులువుగా టెక్స్ట్‌, వాయిస్‌ మెసేజ్‌లతో పాటు వీడియోలు, ఫొటోలు ఏవైనా సరే షేర్‌ చేసుకునేందుకు ఈ యాప్‌ వీలుకల్పిస్తుంది. మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు షేర్‌ చేయడం ఇప్పుడొక అలవాటుగా మారింది. వాట్స్‌ యాప్‌ ద్వారా షేర్‌ చేసే సమాచారం అంత సురక్షితం కాదని, వాటిని మనం షేర్‌ చేస్తున్న వారే కాకుండా, ఇతరులు సైతం చూసేందుకు, యాక్సెస్‌ చేసేందుకు అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్స్‌ యాప్‌లో మనం షేర్‌ చేస్తున్న ఫొటోలు, వీడియోలు, డేటాను ఇతరులు కూడా యాక్సెస్‌ చేసుకునే అవకాశముందని ఇటీవల ఓ సెక్యూరిటీ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఈ వాట్స్‌యాప్‌ అప్లికేషన్‌ వినియోగదార్ల సంఖ్య 50కోట్లను అధిగమించింది. ఉక్రెయిన్‌కు చెందిన జాన్‌ కౌమ్‌, బ్రియాన్‌ యాక్టన్‌ అనే అమెరికన్‌ కలిసి 2009లో ఈ యాప్‌ సేవలను ఆరంభించారు. మొబైల్స్‌, ఎంత పాపులారిటీ వున్నా ఈ యాప్‌కు సైతం హ్యాకింగ్‌ గొడవ తప్పడంలేదు. వేలాది రూపాయలతో కొన్న స్మార్ట్‌ఫోన్లు, అందులోని సమాచారం సురక్షితంగా వుండాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

జాగ్రత్తలు :
* మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్స్‌ యాప్‌ సందేశాలను లాక్‌ చేయటం ద్వారా మీ వాట్స్‌యాప్‌ అకౌంట్‌ సెక్యూరిటీని మరింత పటిష్టం చేయవచ్చు. ఇందుకు గూగుల్‌ప్లే స్టోర్‌లో 'వాట్స్‌యాప్‌ లాక్‌' పేరుతో ఓ ఉచిత యాప్‌ లభ్యమవుతోంది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ద్వారా వాట్స్‌యాప్‌ మెసేజ్‌లను లాక్‌ చేసుకోవచ్చు.

* స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ను రీఇన్‌స్టాల్‌ చేసిన సమయంలో కొన్నిసార్లు పాత సంభాషణలు కనిపించకుండా పోతుంటాయి.

* ఈ సమస్యను అధిగమించేందుకు ఆండ్రాయిడ్‌ వినియోగదార్లు వాట్స్‌యాప్‌ సెట్టింగ్స్‌లోని చాట్‌ సెట్టింగ్స్‌ను సెలక్ట్‌ చేసుకుని చాట్‌ సంభాషణ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే పాత సంభాషణలను తిరిగి పొందొచ్చు.

* పబ్లిక్‌ వై-ఫైకు దూరంగా ఉండంతో పాటు గుర్తు తెలియని నంబర్లను బ్లాక్‌ చేయాలి. దీంతోపాటు మీ వై-ఫైకు పటిష్టమైన పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : whatsapp  hacking  Hackers  Social Media  Tip of the day  Tips  Tips for social media use  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more