Tips to Control Hair Fall

Tips to control hair fall

hair Fall, Hair Fall control Tips, Health Tips, Beauty Tips, Tips for good health, Healthy Tips

Many of us suffering from Hair fall. Men and Women facing hair Fall problem. In Market there is many products to control the Hair Fall. But we providing best tips to control Hair fall

జుట్టు రాలటాన్ని తగ్గించే సహజ పద్దతులు

Posted: 12/03/2015 01:09 PM IST
Tips to control hair fall

జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవటం మీ భాద్యత. జుట్టు రాలటం వలన మానసిక స్థైర్యం కూడా దెబ్బతింటుంది. జుట్టు రాలటాన్ని తగ్గించి, వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. ఇలా జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ముందుగా తలపై చర్మం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. మీ జుట్టు పట్ల తగిన జాగ్రత్తల తీసుకొని ఎడల, వెంట్రుకలు పెళుసులుగా మారి, చుండ్రు ఏర్పడి, జుట్టు మధ్యలోనే తెగే అవకాశం కూడా ఉంది. జుట్టు రాలటానికి ముఖ్య కారణం-జన్యుపర సంక్రమణ అని చెప్పవచ్చు. అంతేకాకుండా, కొన్ని పద్దతులను పాటించటం వలన జుట్టు రాలటాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన మరియు మెరిసే జుట్టును పొందవచ్చు.

ఆరోగ్యకర జుట్టు కోసం ఆహారం:
జుట్టు రాలకుండా ఉండటానికి గానూ, తీసుకునే ఆహారంలో కావలసిన విటమిన్ మరియు మినరల్ లు ఉండేలా చూసుకోవాలి. కావున, మీరు పాటించే ఆహార ప్రణాళికలో, పచ్చని ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, ఓట్స్ మరియు హోల్ గ్రైన్స్, తృణధాన్యాలను కలుపుకోండి. విటమిన్ 'A', 'B', 'E', ప్రోటీన్ మరియు అయోడిన్ వంటి పోషకాలు జుట్టు ఆరోగ్యానికి తప్పని సరి.
జుట్టును ఎలా కడగాలి

జుట్టు కావలసిన పోషకాలను అందించే ఆయిల్ లను రోజు వాడాలి మరియు రెండు రోజులకు ఒకసారి జుట్టును నీటితో కడగాలి. వేడి నీరు జుట్టును ప్రమాదానికి గురి చేస్తాయి, కావున జుట్టును కడగటానికి చల్లటి నీటిని వాడండి. మరీ చల్లటి నీరు కాకుండా, గోరు వెచ్చని నీటితో కడగండి. మీ తలపై చర్మానికి ఆయిల్ లేదా స్నానం చేసే సమయంలో చేతి గోళ్ళు తాకకుండా, కేవలం వెళ్ళు మాత్రమె తాకేలా చుడండి.

జుట్టును ఆరబెట్టడం:
తడిగా ఉన్న జుట్టును సహజంగా ఆరబెట్టండి. డ్రయర్ లను వాడటం వలన జుట్టు పాడయ్యే అవకాశం ఉంది. ఎక్కువ వేడితో డ్రయర్ ను వాడి జుట్టును ఆరబెట్టడం వలన జుట్టు బలహీనంగా, అనారోగ్యంగా మారుతుంది.

జుట్టును ఎలా దువ్వటం:
మీ జుట్టును దువ్వటానికి ఖాళీలు ఎక్కువగా ఉన్న దువ్వెనలను వాడండి. దువ్వెనను కూడా కింది వైపుగా దువ్వండి. జుట్టు తడిగా ఉన్నపుడు మాత్రం దువ్వకండి, ఫలితంగా, త్వరగా తెగిపోయే అవకాశం ఉంది.

కండిషనర్ల వాడకం:
జుట్టుకు కండిషనర్ల వాడకం తప్పని సరే అని చెప్పవచ్చు. కండిషనర్ ను వాడటం వలన వెంట్రుకలపై ఒక పొరలా ఏర్పడి క్లోరిన్ కలిగి ఉన్న నీటి నుండి మరియు హానికర సూర్యకిరణాల నుండి కాపాడుతుంది. హానికర సూర్య కిరణాల నుండి మీ జుట్టును కాపాడుకోవటానికి, రోజు క్యాప్ ను ధరించండి. కావున, కనీసం ప్రతి రెండు రోజులకు ఒకసారైన కండిషనర్ ను వాడండి.

జుట్టు ఆరోగ్యానికి వ్యాయామాలు:
శారీరక వ్యాయామాలు కూడా జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. వ్యాయామాల వలన ఒత్తిడి తగ్గి, తలపై చర్మానికి  రక్త ప్రసరణను మెరుగుపరచి, జీర్ణాశయ విధిని మెరుగుపరచి మరియు ఆహారంలో ఉన్న పోషకాలను గ్రహించేలా ప్రోత్సహిస్తాయి. ఫలితంగా, జుట్టుకు కావలసిన పోషకాలు గ్రహించబడి, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hair Fall  Hair Fall control Tips  Health Tips  Beauty Tips  Tips for good health  Healthy Tips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more