The Best Kitchen Remedies For Strong Teeth And Gums | Health Tips | Teecth Best Remedies

Best kitchen remedies for strong teeth and gums health tips

teeth remedies, gums remedies, teeth gums remedies, teeth health tips, teeth home remedies, teeth health tips, health tips for teeth, teeth gums health, home remedies, healthy home remedies

Best Kitchen Remedies For Strong Teech And Gums Health Tips : The Best Kitchen Remedies For Strong Teeth And Gums.

దంతాల ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు

Posted: 08/11/2015 06:27 PM IST
Best kitchen remedies for strong teeth and gums health tips

ప్రస్తుత ఆధునిక యుగంలో చాలామంది దంతాలు, చిగుళ్ల నొప్పితో బాధపడుతున్నారు. ఏదైనా తిన్నప్పుడు వారి దంతాలు తీవ్ర నొప్పి గురవుతాయి. అంతేకాదు.. తరచూ రక్తస్రావం కూడా జరుగుతుంటుంది. కాలక్రమంలో దంతాలు వదులుగా తయారై ఊడిపోతాయి. ఇలాంటి సమస్యని ఎదుర్కోవాలంటే కొన్ని ఎఫెక్టివ్ రెమెడీలు వాడితే చాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా...

* టేబుల్ సాల్ట్ - మస్టర్డ్ ఆయిల్ : ఒక పాత్రలో కొద్దిగా ఆవనూనె తీసుకుని అందులో కాస్త ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిగుళ్ళ మీద అప్లై చేయాలి. ఆ తర్వాత సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. చిగుళ్ళ బలంగా తయారవడంతోపాటు దంతాలు వదులవ్వకుండా వుంటాయి.

* బ్లాక్ పెప్పర్ - పసుపు : ముందుగా పెప్పర్ ను పౌడర్ గా తయారుచేసుకుని.. అందులో కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చిగుళ్ళ మీద మసాజ్ చేయాలి. 30 నిముషాల తర్వాత భోజనం చేయాలి. ఇలా చేస్తే.. చిగుళ్ళు వాపు తగ్గి.. అవి బలోపేతం అవుతాయి. దంతాలు కూడా వదలవ్వకుండా ఉంటాయి.

* ఉప్పు నీరు : ఒక గ్లాసు నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ నీటిని నోట్లో పోసుకొని పుక్కలిస్తుండాలి. ఇలా చేయడం వల్ల ఓరల్ ఇన్ఫెక్షన్ దూరమవుతుంది. ఉప్పులో యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చిగుళ్ళను స్ట్రాంగ్ గా మార్చడంతోపాటు దంతాలు వదలవ్వకుండా చేస్తుంది.

* ఆమ్లా ఫ్రూట్ జ్యూస్ : విటమిన్ సి అధికంగా ఉండే ఆమ్లా ఫ్రూట్ జ్యూస్ చిగుళ్ళ వాపును, దంతాల అతుక్కొని ఉన్న కణజాలాలను వాపును నివారించడానికి సహాయపడుతుంది. ఆమ్లా జ్యూస్ తో ప్రతి రోజూ నోటిని శుభ్రం చేసుకోవాలి. ఈ జ్యూస్ రెగ్యులర్ గా ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

* లవంగం నూనె : దంతాల నొప్పిని, ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి ఇది ఎఫెక్టివ్ హోం రెమెడీ. చిగుళ్ళ మీద లవంగం నూనెతో మసాజ్ చేయడం వల్ల చిగుళ్ళ వాపు, నొప్పి రెండూ నివారించబడుతాయి. ఇది దంతాలు వదలవ్వకుండా నేచురల్ గా తగ్గిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : teeth remedies  kitchen tips for teeth  health tips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more