మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా వుంచేందుకు కిడ్నీలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మన శరీరంలో వుండే మలిన పధార్థాలను శుభ్రం చేయడంలో ఇవే ప్రధానంగా ఉపయోగపడుతాయి. అంతేకాకుండా మన శరీంలో వుండే రక్తాన్ని కూడా ఇవి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటాయి. అలాంటప్పుడు ఇటువంటి కిడ్నీలను పాడవకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు నిపుణులు. దానికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏమైనా త్యాగాలు చేయాల్సి వచ్చిన మనకు పెద్దగా నష్టం ఏమీ వుండదు. నిపుణుల సమాచారం ప్రకారం.. కిడ్నీలు పాడవకుండా వుండాలంటే అధికంగా ద్రవ పధార్థాలను తీసుకోవాలని అంటున్నారు. అంటే మనం తాగే నీటిని ఎంత అధిక మొత్తంలో తీసుకుంటే కిడ్నీలు అంతా ఆరోగ్యవంతంగా, శుభ్రంగా వుంటాయన్నమాట.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
మన దినసరి జీవితచర్యలలో నీళ్లు ఎలాగో తీసుకుంటుంటాం. కాకపోతే వాటిని కొంచెం అధిక మొత్తంలో తీసుకుంటే చాలామంచిది. దీనివల్ల మూత్రం అధికంగా రావడంతో మన శరీరంలో వుండే మలినాలు కూడా శుభ్రం అవుతాయి.
అదే విధంగా నల్లగా వుండే పళ్లను.. అంటే బ్లాక్ గ్రేప్స్, నేరేడు పళ్లు, బ్లాక్ బీన్స్, ఇంకా ఇతరత్ర పళ్లు తీసుకోవడం చాలా మంచింది.
కాఫీని ఎంత తక్కువ మోతాదులో తీసుకుంటే అంతే మంచిది.
మనం వీలైనంతవరకు తాగుడుకుగానీ, పొగాగుకు(స్మోకింగ్) దూరంగా వుండడం మంచింది. వీటిలో వుండే హానికరమైన పధార్థాలు మన శరీరానికి హాని కలిగిస్తాయి.
అలాగే పచ్చని ఆకుకూరలు అధికమొత్తంలో తీసుకుంటే మంచింది. ఒకవేళ మీరు ఆకుకూరలు తీసుకోకపోతే.. కనీసం కొత్తీమీరైనా తీసుకోండని చెబుతున్నారు నిపుణులు.
సముద్రపు ఉప్పు (సీ సాల్ట్)ను ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇందులో సోడియం క్లోరైడ్ తక్కువగా వుంటుంది.
ఇక నూనె విషయానికి వస్తే.. ఆలివ్ ఆయిల్ తీసుకోవడం మంచిది. ఇవి కిడ్నీలను ఆరోగ్యంగా, శుభ్రంగా వుంచడానికి దోహదపడతాయి. ఇందులో వుండే ఒమేగా 3 ఫాటీ ఆసిడ్ లు శరీరంలో వుండే కొవ్వును కరిగించండంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. అంతేకాకుండా అవి రీనల్ సెల్స్ చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి.
మన శరీరంలో మిగతా అవయవాల లాగే కిడ్నీలు కూడా ఎక్కువ పనిచేస్తాయి కాబట్టి నిద్ర తప్పనిసరి.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more