Safety journey tips for woman

Safety Journey Tips for woman, Top Safety Tips for Women Travelers, Women travel.

Safety Journey Tips for woman, Top Safety Tips for Women Travelers, Women travel.

ఒంటరి ప్రయాణమా... జాగ్రత్త!

Posted: 12/06/2013 09:18 PM IST
Safety journey tips for woman

ఆఫీసు పని మీదో, వ్యక్తిగత పని మీదో... కొన్నిసార్లు ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. వెళ్లేది బస్సులో అయినా, రైల్లో అయినా కానీ, జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరి. అందుకు ఏం చేయాలంటే...

- వాహనంలో ఆడవాళ్లు ఎవరూ లేకపోతే, వీలైనంతవరకూ వేరేదానిలో వెళ్లేందుకు ప్రయత్నించడం మంచిది. లేదంటే కనీసం మెయిన్‌డోరుకు దగ్గరలో ఉన్న సీట్లో కూర్చోవడం ఉత్తమం !

- కొందరు కావాలని మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. అస్సలు మాట్లాకుండా ఉండనక్కర్లేదు. ఆచితూచి మాట్లాడండి. వ్యక్తిగత విషయాలు చెప్పొద్దు !

- నా ఫోన్ చార్జింగ్ అయిపోయింది, మీదోసారి ఇవ్వమని ఎవరైనా అడిగితే... నిర్మొహమాటంగా ‘నో ’ అనండి. వాళ్లు మీ నంబర్ సేవ్ చేసుకుని తర్వాత విసిగించే ప్రమాదం ఉంది !

- ఎవరైనా ఏదైనా పెడితే తినవద్దు. వాళ్లు ఫీలవుతారు అనుకుంటే, అది మీరు తినకూడదనో, ఒంటికి పడదనో చెప్పి తప్పించుకోండి !

- రైలు కంపార్ట్‌మెంట్లో మీరొక్కరే ఆడవాళ్లయితే... బాగా పై బెర్తులోనే పడుకోండి. అలాగే టాయిలెట్‌కు వెళ్లినప్పుడు సెల్‌ఫోన్, ఏవైనా సేఫ్టీ వెపన్స్ ఉంటే వాటిని కూడా తప్పక తీసుకెళ్లండి !

- ఎవరైనా అనుమానాస్పదంగా అనిపించినా, మీమీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారనో లేక మిమ్మల్ని ఎక్కువగా పరిశీలిస్తున్నారనో అనుమానం వచ్చినా... రైలయితే కంపార్ట్‌మెంట్ మారండి. బస్సయితే సీటు మారండి. టీసీకో లేక బస్సు డ్రైవరుకో విషయం తప్పక చెప్పండి !

- వీలైనంతవరకూ నిద్రపోకుండా ఉండేందుకు ట్రై చేయండి. మరీ దూర ప్రయాణం అయితే ఎలాగూ తప్పదు కదా! అలాంటప్పుడు నిద్రపోయినా మరీ మొద్దు నిద్రపోవడం అంత మంచిది కాదని గుర్తుంచుకోండి !

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Driving tips for old age persons

  మలివయసులో డ్రైవింగ్ చేసేవారికి టిప్స్!

  Apr 24 | ప్రస్తుతకాలంలో వాహనాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. యుక్తవయస్కుల నుంచి 60 ఏళ్లు పైబడినవారు కూడా ప్రతిఒక్కరు కారును నడుపుతున్నారు. అదేవిధంగా యాక్సిడెంట్లు కూడా ఎక్కడబడితే అక్కడ జరుగుతున్నాయి. అయితే తాజాగా నిర్వహించిన సర్వేల్లో.. యాక్సిడెంట్లలో... Read more

 • The best places in gujarat

  గుజరాత్ లోని పర్యాటక ప్రదేశాలు

  Mar 24 | ఆధ్యాత్మిక ప్రదేశాల నుంచి ఎంతో సుందరమైన ప్రకృతి దృశ్యాలదాకా గుజరాత్ రాష్ట్రం నానాటికీ అభివృద్ధి చెందుతూనే వుంది. సంస్కృతి సంప్రదాయాలపరంగా, వ్యాపారపరంగా, విహరించడానికి అనుగుణంగా ఈ ప్రదేశం ప్రతిఒక్కరిని ఆకర్షిస్తూనే వుంది. ప్రముఖ నటుడయిన... Read more

 • Best places for tourist in delhi

  ఢిల్లీలో పర్యటించాల్సిన ప్రదేశాలు

  Mar 21 | మన భారతదేశంలో వున్న అన్ని ప్రదేశాలలో గర్వించదగ్గ ప్రాంతాలలో దేశ రాజధాని అయిన ఢిల్లీ ఒకటి. ఇక్కడికి విహరించడానికి ప్రపంచంలోని అనేక దేశాల పర్యాటకులు విచ్చేస్తుంటారు. ఢిల్లీలో ఆకర్షించే ప్రాంతాలు చాలానే వున్నాయి. ఢిల్లీ... Read more

 • Nainital city life culture

  నైనిటాల్... భారతదేశపు సరస్సుల ప్రాంతం

  Mar 17 | మొత్తం ప్రపంచంలోనే భారతదేశంలో ఎంతో అద్భుతమైన హిమాలయ శ్రేణుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతం ఎప్పుడూ పర్యాటకులతో నిండి వుంటుంది. చిన్న, పెద్ద, వయస్సుతో ఎటువంటి తేడా లేకుండా ప్రతిఒక్కరు... Read more

 • Vellore city culture

  ‘ఫోర్ట్ సిటీ ఆఫ్ తమిళనాడు’

  Mar 13 | దక్షిణ భారతదేశంలోనే ప్రయాణికులకు ‘‘వెల్లూర్’’ ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో పురాతనకాలం నుంచి వున్న కట్టడాలు, దేవాలయాలు, ద్రావిడ నాగరికతలను సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు ఇక్కడ వున్నాయి. హిందూ సంస్కృతీ,... Read more