ఆధ్యాత్మిక ప్రదేశాల నుంచి ఎంతో సుందరమైన ప్రకృతి దృశ్యాలదాకా గుజరాత్ రాష్ట్రం నానాటికీ అభివృద్ధి చెందుతూనే వుంది. సంస్కృతి సంప్రదాయాలపరంగా, వ్యాపారపరంగా, విహరించడానికి అనుగుణంగా ఈ ప్రదేశం ప్రతిఒక్కరిని ఆకర్షిస్తూనే వుంది.
ప్రముఖ నటుడయిన అమితాబ్ బచ్చన్ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన పర్యాటక ప్రదేశాల గురించి టీవీ యాడ్ లలో ప్రచారం ఇప్పటికీ చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని పర్యటించడానికి మన దేశవాసులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పర్యాటకులు ప్రతిసారి వస్తూనే వుంటారు.
హిందువులకు సంబంధించిన దేవాలయాలు, ఆధ్యాత్మిక స్థలాలు ఇక్కడ ఎంతో పేరు గాంచినవి. వాటికి సంబంధించిన స్థలపురాణాలు కూడా రాసి వున్నాయి.
పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ఇక్కడ టూరిజం శాఖ ముందుకు సాగిపోతోంది.
గుజరాత్ లో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు :
వదోదర ప్రదేశం... ఇది ఎంతో ఆకర్షణీయమైన ప్రాంతం. ఈ ప్రదేశంలో ఎక్కువగా ఆర్ట్ వర్క్ తో నిండి వుంటుంది. ఎన్నో శిల్పాలు, చెక్కడాలు ఈ ప్రాంతంలో ముఖ్యమైనవి. లక్ష్మి విలాస్ పాలస్, నాజర్ బాగ్ పాలస్, మాకార్పుర పాలస్ లు ఇక్కడ తప్పక విహరించాల్సిన ప్రాంతాలు. దభోయి, కాదియా దుందర్ కేవ్స్, వదోదర మ్యూజియం లు ఇతర ఆకర్షణీయమైన దృశ్యాలు.
సర్దార్ సరోవర్... గుజరాత్ లోని నర్మదా నది ఒడ్డున ఎంతో పెద్దదయిన సర్దార్ సరోవర్ డాం పర్యాటకులను నిత్యం ఆకర్షీస్తూనే వుంటుంది. ఇది కేవలం విహరించే ప్రాంతంగానే కాకుండా... వ్యాపారపరంగానూ ఎంతో ఉపయోగకరమైంది. మంచినీళ్లు తాగడానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి దీనిని కట్టించారు. ఇక్కడున్న ప్రకృతి అందాలకు పర్యాటకులు దాసోహం అయిపోతారు. ఈ ప్రదేశానికి చుట్టుపక్కలు వున్న రతన్ మహల్ స్లాత్ బేర్ సంక్చురి, విశాల ఖాది ఈకో కెంప్ సైట్ , చారిత్రాత్మక పట్టణాలు భారుచ్, రాజ్ పిప్లాలు చూడదగినవి.
ఝూల్తా మినారా... అహ్మదాబాద్ లోని పురాతన కట్టడాలలో ఇది ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఎందుకంటే.. ఈ కట్టడానికి వున్న స్థంబాలు నిత్యం కదులుతూనే వుంటాయి. కాని అవి ఎందుకలా కదులుతాయో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. ప్రభుత్వం దీనిమీద ఎక్కేందుకు నిష్ర్కమించారు. అయినప్పటికీ దీనికి వీక్షించేందుకు లక్షలమంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. గాంధీ ఆశ్రమం, జామా మసీద్, జైన్ టెంపుల్, కన్కారియ లేక్ లు మొదలైన ప్రదేశాలు అహ్మదాబాద్ లో ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి.
యూరోపియన్ టూంబ్స్... బ్రిటీష్ వారు తమ కాలంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సూరత్ లో స్మారక భవనాలను నిర్మించుకున్నారు. ఈ టోంబ్స్ పై హిందువులు, ఇస్లామిక్ శిల్పాలు కూడా వున్నాయి. సూరత్ లో ఇంకా చింతామణి జైన్ టెంపుల్, దూమాస్ బీచ్, ముఘల్ సారాయి వంటివి కూడా చూడవచ్చు.
హరప్పా నగరం... హరప్పా నగరం అయిన దోలవీర ప్రాంతం గుజరాత్ లోనే ఒక గొప్ప పర్యాటక ప్రాంతం. ఈ పురావస్తు ప్రాంతం సింధూ నాగరికతకు చెందింది. ఈ ప్రాంతాన్ని 1967-68 సంవత్సరం లో కనుగొన్నారు. ఈ ప్రాంతంలో వుండే శిల్ప కళలు, టవున్ ప్లానింగ్ ఎంతో అద్భుతంగా వున్నాయని ఇక్కడి వచ్చే ప్రతి పర్యాటకుడు ఆహ్లాదకరంగా చెబుతుంటారు.
ఇండో ఇస్లామిక్ శిల్పాలు... గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ప్రదేశంలో కూడా చారిత్రాత్మక కట్టడాలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. గాంధీనగర్ 15 కిలోమీటర్ల దూరంలో ఇండో ఇస్లామిక్ శిల్పాలు నిర్మించబడి వున్నాయి. ఈ శిల్పాలలో ఎంతో గొప్పదైన శిల్పం మెట్ల బావి. గాంధీనగర్ లో వుండే స్థానికులు దీనిని ఎంతో ఆధ్యాత్మికంగా భావిస్తారు. పర్యాటకులు సందర్శించాల్సిన ప్రాంతాలలో తప్పకుండా ఒక్కసారైనా ఈ ప్రదేశానికి వెళ్లాల్సిందే. ఈ మెట్ల బావికి సమీపంలో అక్షరాధం టెంపుల్ , మహాత్మా మందిర్, క్రాఫ్ట్ మెన్ విలేజ్ లు ఎంతో ఆహ్లాదకరంగా వుంటాయి.
ఇంద్రాద దినోసార్ పార్క్... ఈ పార్క్ కూడా గాంధీనగర్ లోనే వుంది. ఇది సబర్మతి రివర్ కు ఒడ్డున వుంది. ఈ పార్క్ ను ఇండియా దినోసార్ పార్క్ అని కూడా అంటారు. ప్రపంచంలోనే దినోసార్ ఎగ్స్ కు సంబంధించి రెండవ అతిపెద్ద పార్క్ ఇదే.
జగత్ మందిర్... ఈ మందిరం ఎంతో పురాతనమైన 2500 సంవత్సరాల కాలంనాటిది. ప్రపంచంలోనే ఈ టెంపుల్ రెండవ పురాతనమైన లార్డ్ కృష్ణ టెంపుల్ గా చెబుతుంటారు.
కీర్తి మందిర్... ఈ ప్రదేశంలోనే మహాత్మాగాంధీ జన్మించారు. ఈ మందిరం పోర్ బందర్ లో వుంది. గాంధీకి సంబంధించిన వస్తువులు, వస్త్రాలు ఇక్కడ ప్రదర్శించబడుతాయి. పోర్ బందర్ లో కల బరదా హిల్స్ వైల్డ్ లైఫ్ సంక్చురి, పోర్ బందర్ బీచ్ , హజూర్ పాలస్ లు ఇతర ఆకర్షణలు.
సపూతర హిల్ స్టేషన్... గుజరాత్ లోనే ఎంతో ఆకర్షణీయమైన, అందమైన ప్రదేశంగా సపూతర హిల్ స్టేషన్ ప్రసిద్ధి చెందింది. దీనిని విహరించడానికి చాలామంది పర్యాటకులు వస్తుంటారు. దీనిని చూసినవారు స్వర్గాన్ని తలపిస్తుందని అంటుంటారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే వున్న గిర వాటర్ ఫాల్స్, గవర్నర్ హిల్, పూర్ణ వైల్డ్ లైఫ్ సంక్చురి, వంస్డా నేషనల్ పార్క్ ప్రసిద్ధి చెందినవి.
వేలాడే బ్రిడ్జ్... ఈ బ్రిడ్జి విక్టోరియా లండన్ బ్రిడ్జిలాగే పోలి వుంటుంది. ఈ బ్రిడ్జి మొర్బి ప్రాంతంలో ఎంతో ఆకర్షణీయమైంది. ఒక ఇంజనీర్ తమ అద్భుత కళతో దీనిని నిర్మించారు. బ్రిడ్జి సమీపంలో ఆర్ట్ దేకో పాలస్, గ్రీన్ చౌక్, మని మందిర్ మరియు వెల్లింగ్టన్ సేక్రే టేరిఅట్ లు ఇతర ఆకర్షణలు.
చంపానేర్... చంపానేర్ ప్రదేశం ఈ మధ్యకాలంలోనే ప్రజలకు బాగా తెలిసిన పర్యాటక ప్రదేశం. ఇది ఇంతకుముందు అడవిలో భాగంగా వున్న ప్రదేశం.
సోమనాథ్ టెంపుల్... ఈ టెంపుల్ ను దర్శించుకోవడానికి కేవలం మన భారతదేశంలోనే కాదు... విదేశాలనుంచి కూడా ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఇది గుజరాత్ లో వుండే టూరిస్ట్ ప్రదేశాలలోనే ఎంతో గొప్పది. ఇక్కడికి విహరించడానికి పర్యాటకులు లక్షల్లో వస్తుంటారు. ఈ టెంపుల్ సుమారు ఏడుసార్లు విధ్వంసానికి గురి అయి... మళ్లీ తిరిగి ఏడుసార్లు నిర్మించబడింది. ఈ సోమనాథ్ టెంపుల్ ని పూర్వం చంద్రదేవుడు బంగారంతో నిర్మించాడని చెబుతుంటారు పెద్దలు. అలాగే సూర్యుడు సిల్వర్ తో, కృష్ణుడు కలపతో, 11వ శతాబ్దంలో సోలంకి రాజులు రాతితోను నిర్మించారని కథనాలు వున్నాయి.
ఈ విధంగా గుజరాత్ రాష్ట్రం ప్రపంచపర్యాటక రాష్ట్రంగా ఎంతో అభివృద్ధి చెందింది.. చెందుతూనే వుంది. ప్రస్తుతం వేసవికాలంలో విహరించడానికి గుజరాత్ రాష్ట్రం ఎంతో అనువైనది.. అనుకూలమైనది.
(And get your daily news straight to your inbox)
Apr 24 | ప్రస్తుతకాలంలో వాహనాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. యుక్తవయస్కుల నుంచి 60 ఏళ్లు పైబడినవారు కూడా ప్రతిఒక్కరు కారును నడుపుతున్నారు. అదేవిధంగా యాక్సిడెంట్లు కూడా ఎక్కడబడితే అక్కడ జరుగుతున్నాయి. అయితే తాజాగా నిర్వహించిన సర్వేల్లో.. యాక్సిడెంట్లలో... Read more
Mar 21 | మన భారతదేశంలో వున్న అన్ని ప్రదేశాలలో గర్వించదగ్గ ప్రాంతాలలో దేశ రాజధాని అయిన ఢిల్లీ ఒకటి. ఇక్కడికి విహరించడానికి ప్రపంచంలోని అనేక దేశాల పర్యాటకులు విచ్చేస్తుంటారు. ఢిల్లీలో ఆకర్షించే ప్రాంతాలు చాలానే వున్నాయి. ఢిల్లీ... Read more
Mar 17 | మొత్తం ప్రపంచంలోనే భారతదేశంలో ఎంతో అద్భుతమైన హిమాలయ శ్రేణుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతం ఎప్పుడూ పర్యాటకులతో నిండి వుంటుంది. చిన్న, పెద్ద, వయస్సుతో ఎటువంటి తేడా లేకుండా ప్రతిఒక్కరు... Read more
Mar 13 | దక్షిణ భారతదేశంలోనే ప్రయాణికులకు ‘‘వెల్లూర్’’ ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో పురాతనకాలం నుంచి వున్న కట్టడాలు, దేవాలయాలు, ద్రావిడ నాగరికతలను సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు ఇక్కడ వున్నాయి. హిందూ సంస్కృతీ,... Read more
Mar 10 | ఒరిస్సా రాష్ట్రంలోని మూడు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ‘గోపాల్పూర్’ ఒకటి. ఇది ఒరిస్సాలోని దక్షిణ సరిహద్దులైన్లపై వున్న ఒక కోస్తా పట్టణం. ఇది బంగాళఖాతానికి చాలా సమీపంలో వుండడంవల్ల ఎంతో ప్రసిద్ధి చెందింది. కాలంతో... Read more