Director Avasarala Srinivas Making New Movie With Interesting Title | Tollywood News | Telugu Movie News Updates

Avasarala srinivas new movie with interesting title

Avasarala Srinivas news, Avasarala Srinivas new movie, director Avasarala Srinivas updates, Avasarala Srinivas career, Avasarala Srinivas biography, Avasarala Srinivas filmography, Avasarala Srinivas new movie title, jyo achyutha anandam movie

Avasarala Srinivas New Movie With Interesting Title : Director Avasarala Srinivas Making New Movie With Interesting Title Which Is Based On The Characters Of That Film.

ఆసక్తికరమైన ‘టైటిల్’తో కొత్త సినిమా

Posted: 09/15/2015 12:31 PM IST
Avasarala srinivas new movie with interesting title

‘అష్టా చమ్మా’ సినిమాతో వెండితెరకు పరిచయమైన శ్రీనివాస్ అవసరాల.. తనదైన కామెడీ టైమింగ్‌తో అనతికాలంలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతర కమెడియన్ల కంటే కాస్త డిఫరెంట్ స్టైల్ తో నవ్వు పుట్టించే క్యారెక్టర్ తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించాడు. కేవలం నటుడిగానే కాదు.. దర్శకత్వం వైపు అడుగులు వేసి ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తనలో దాగివున్న మరో టాలెంట్ ని నిరూపించుకున్నాడు. దీంతో ఈ నటుడికి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించే అవకశాలు రావడంతోపాటు మరో సినిమాకు దర్శకత్వం ఆఫర్ లభించింది.

‘ఊహలు గుసగుసలాడే’ సినిమా మంచి విజయం సాధించడంతో మరో సినిమా తీయాలని శ్రీనివాస్ అప్పుడే ఫిక్స్ అయ్యాడు. అందుకు సంబంధించిన కథ, ఇతర పనుల్లో నిమగ్నమయ్యాడు. ఇప్పుడు ఆ పని మొత్తం తుదిదశకు చేరుకోవడంతో తన తాజా చిత్రానికి సంబంధించిన వివరాలను తెలియజేశాడు. వారాహి సంస్థ నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాను త్వరలోనే ప్రారంభించనున్న శ్రీనివాస్.. ఆ మూవీకి సంబంధించిన విశేషాలు వెల్లడించాడు. ఆ సినిమా స్టోరీ ఏంటంటే.. అచ్యుత రామారావు, ఆనంద్ వర్ధన్‌రావు అనబడే ఇద్దరు అన్నదమ్ములు వుంటారు. వారిరివుతోపాటు వారికి కూతురు వరుసైన జ్యోత్స్న అనే అమ్మాయి వారిద్దరితోనే వుంటుంది. ఈ ముగ్గురు జీవితం ఎలా గడుస్తుంది.. వారికి ఇబ్బందులు వస్తే వాటిని ఎలా ఎదుర్కొంటారు.. వంటి ఆసక్తికరమైన విషయాలతో తన కొత్త సినిమా తెరకెక్కనుందని శ్రీనివాస్ తెలిపాడు.

ఇక ఈ సినిమా టైటిల్ చాలా ఆసక్తికరంగా వుంటుందని పేర్కొన్నాడు. ఆ ముగ్గురు క్యారెక్టర్ల పేర్ల ద్వారానే సినిమా టైటిల్ ఉండనుందని ఓ హింట్ ఇచ్చాడు శ్రీనివాస్.. ఈ మూడు పేర్లూ కలిపితే వచ్చే ‘జ్యో అచ్యుత ఆనంద’ అనే ప్రఖ్యాత కీర్తనను సినిమా పేరుగా పెట్టనున్నామనే విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా వెల్లడించాడు. సెప్టెంబర్ 17న వినాయక చవితి రోజు ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని దర్శకుడు శ్రీనివాస్ స్పష్టం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Avasarala Srinivas  Tollywood Movie Udpates  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more