లోకనాయకుడు కమల్ హాసన్.. ఇటీవలే ‘ఉత్తమ విలన్’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే! ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన కమల్.. తన తదుపరి చిత్రంలో ఓ ‘విలక్షణ పాత్ర’ను ఎంచుకున్నాడని సమాచారం! పైగా.. కథాంశం కూడా చాలా భిన్నంగా వుంటుందని చిత్రవర్గాలు తెలుపుతున్నాయి. కేవలం ఒకే రాత్రిలో జరిగే కథగా ఆ చిత్రం రూపొందుతోంది.
ఆ కొత్త సినిమాలో కమల్ ఓ పోలీసాఫీసర్ పాత్రను పోషించనున్నాడు. అయితే.. ఇది సాదాసీదా పాత్ర కాదని.. విలక్షణతో నిండిన పాత్ర అని అంటున్నారు. ఈ సినిమాకి కమల్ రచన చేయగా.. ఆయన వద్ద పనిచేసిన రాజేష్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయని చిత్రవర్గాలు తెలుపుతున్నాయి.
ఇక ఈ సినిమాలో కమల్ సరసన చెన్నై సెక్సీ బ్యూటీ త్రిష నటిస్తోంది. ఈ చిత్ర దర్శకనిర్మాతలు త్వరలోనే మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ చిత్రం చాలా థ్రిల్లింగ్ గానూ, సస్సెన్స్ గానూ కొనసాగుతుందని వారంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more