Rajnikanth To Make Latest Experiment With Young Director Ranjith | Kollywood Gossips

Rajnikanth latest experiment young director ranjith shankar murugadoss

rajnikanth news, rajnikanth gossips, rajnikanth new movie, young director ranjith, director shankar, director murugadoss, rajnikanth shankar movie, rajnikanth robo 2 movie, rajnikanth murugadoss movie, rajnikanth ranjith movie

Rajnikanth Latest Experiment Young Director Ranjith Shankar Murugadoss : According to kollywood Super Star Rajnikanth Making A new Experiment with new director Ranjith to get a big success Movie.

రజనీ ఆ ‘కొత్త’ ప్రయోగం చేస్తాడా? లేదా?

Posted: 05/04/2015 07:42 PM IST
Rajnikanth latest experiment young director ranjith shankar murugadoss

రజనీకాంత్ పేరు వినిపిస్తే చాలు.. ఇండియన్ ఇండస్ట్రీలోనే ఓ సరికొత్త కల వచ్చేస్తుంది. ఎందుకంటే.. ఆయన నటించే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రత్యేక వుంటుంది. అంతేకాదు.. ఆయన కూడా ఆ సినిమాకు తగ్గట్టుగానే ఎంతో స్టైలిష్ గా, చాలా యంగ్ గా కనువిందు చేస్తారు. అందుకే.. ఈయన సినిమా వస్తోందంటే ప్రేక్షకులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తారు. కొందరైతే ఉత్సవాలు జరుపుకుంటారు కూడా! ఇంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈయన కెరీర్లో రెండు సినిమాలు దురదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. అప్పటివరకు ఈయనకున్న ఇమేజ్ ని ఆ మూవీలు కాస్త దెబ్బతీశాయి. దీంతో తీవ్ర అసంతృప్తిలో వున్న ఈయన.. తన తదుపరి మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు.

ఈ క్రమంలోనే రజనీ ఓ సరికొత్త, ఆకర్షణీయమైన స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ప్రణాళికలు చేసుకుంటున్నారని సమాచారం! అందుకు ఈయన ‘రంజిత్’ అనే ఓ యువదర్శకుడితో సినిమా చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. గతంలో రంజిత్ తెరకెక్కించిన కథాంశాలు కొత్తగా వుండటంతో ప్రేక్షకుల నుంచి ఇతనికి మంచి మార్కులే లభించాయి. దీంతో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న రంజిత్ దర్శకత్వంలో రజనీ సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడని అంటున్నారు. ఈ సినిమాకి మల్లన్న మూవీని నిర్మించిన కళైపులి థాను నిర్మాతగా వ్యవహరిస్తారని చెప్పుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతమున్న సమయంలో రజనీ అటువంటి ప్రయోగాలకి జోలికి వెళ్లాడని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

రజనీ సాధ్యమైనంతవరకు శంకర్ తో లేదా మురుగదాస్ తో సినిమా చేయొచ్చని అంటున్నారు. కొత్త దర్శకుడితో ప్రయోగం చేయడంకంటే సక్సెస్ లభించే వారితోనే సినిమా చేస్తే డీలా పడిన తన ఇమేజ్ ని మళ్లీ పుంజుకోవచ్చన్న ఉద్దేశంతో ఆ పెద్ద దర్శకులవైపు రజనీ ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం వుంది. అయితే.. ఆ ఇద్దరు పెద్ద డైరెక్టర్లు తమ సినిమాకోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు కాబట్టి.. అప్పటివరకు రజనీ పరాజయం పలకరింపు వెంటాడుతూనే వుంటుందని, దానికంటే కొత్తదనం కలిగిన రంజిత్ సినిమాను చేయడమే మంచిదనే నిర్ణయానికి రజినీ వచ్చినట్లు చెబుతున్నారు. మరి.. ఈ విషయంలో స్పష్టత రావాలంటే.. రజనీయే తన తదుపరి మూవీపై స్పందించాల్సి వుంటుందని అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajnikanth  young director ranjith  shankar  murugadoss  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more