Banned Pak cricketer Danish Kaneria to settle in India?

Kaneria s india visit sparks rumours

Danish Kaneria, Danish Kaneria banned, Danish Kaneria match-fixing, Danish Kaneria Pakistan, Danish Kaneria BCCI, India, Pakistan, bcci,

Danish Kaneria flew down to India along with his family and is presently said to be in Kochi. The former Pakistan cricketer has claimed that they have come to India to perform certain religious rituals.

భారత్ లో స్థిరపడనున్న కనీరియా..?

Posted: 06/01/2016 06:21 PM IST
Kaneria s india visit sparks rumours

నిషేధిత పాకిస్థాన్‌ లెగ్‌స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా, అతడి కుటుంబం ఉన్నట్టుండి భారత పర్యటనకు రావడం మిస్టరీగా మారింది. డానిష్ కనీరియా ముందస్తు సమాచారం లేకుండానే భారత్ కు వచ్చారన్న వార్తలు సోషల్ మీడియాలో వ్యక్తం కావడం.. ఇక ఇదే హాట్ టాపిక్ గా మీడియా కూడా కథానాలను ప్రచురించింది. కనీరియా భారత్ లో స్థిరపడుతారా..? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కాగా, అతడి సోదరుడు వికీ మాత్రం పూజలు జరిపించడానికి వెళ్లినట్టు చెబుతున్నా.. అది నిజం కాదనిపిస్తోంది.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన వినతులను పట్టించుకోవడం లేదని గతంలో అరోపించిన కనీరియా.. చేసేది లేక తన జీవనాధారం కోసమే ఇండియా వలస వచ్చినట్టు విశ్వసిస్తున్నారు. కనేరియా తన భార్య, పిల్లలు, తల్లితో కలసి హఠాత్తుగా భారతకు పయనమ య్యాడు. ప్రస్తుతం వారు కొచ్చిలో ఉన్నట్టు తెలుస్తోంది. తాను హిందువును కావడం వల్ల భారతలోనైతే తనకు తగిన న్యాయం జరుగుతుందని కనేరియా గతంలో చెప్పడం ఇప్పుడు అనుమానాలకు ఊతమిస్తుంది. తనపై వివక్ష చూపుతున్నట్టుగా కూడా కనేరిగా ఆరోపించడం వివాదాస్పదమైంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : danish kaneria  pakistan cricket board  spot fixing  cricket  

Other Articles