ఈ భూమి మీద వెలసిన అనేక శక్తి పీఠాల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ లో. జోగులాంబ అమ్మవారు ఒకటి. శక్తికి ప్రతిరూపాలైన అమ్మవారి రూపాలు అనేకం. విభిన్న రూపాల్లో దర్శనం ఇచ్చే ఈ అమ్మవార్లలో అలంపూర్ జోగులాంబ దేవాలం ఒకటి. రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో, మహబూబ్ నగర్ జిల్లా శివారులో నెలవై ఉంది ఆలంపూర్ పట్టణం. ఆలయాల నగరంగా ప్రఖ్యాతి గాంచిన ఆలంపూర్ పట్టణసిగలో మణిముకటమై వెలసింది ఈ జోగులాంబ దేవాలయం. పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా, పావన తుంగభద్రా నది తీరాన వెలిసిన ఈ జోగులాంబ దేవాలయం నిత్యం భక్తులకు కరుణా కటాక్షాలు చూపుతూ పూజలందుకుంటున్న ఈ దేవాలయం గురించి...
ఆలయ చరిత్ర
క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్యరాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 14 వ శతాబ్ధంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే, ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా, జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటినుంచి 2005 వరకూ అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారని పునప్రతిష్టించారు.
ఆలయ స్థల పురాణం
అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ ప్రాచుర్యమంలో ఉంది. శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అవమానాల పాలై, అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోకసంచారం చేస్తుంటాడు. అదే సమయంలో శివ వర ప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి, కన్యకల పాలచేత పెంచబడ్డ వాడివల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడుది.
ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే, తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు. కానీ, మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం పద్దెనిమి భాగాల్లో ఊర్థ్వ దంతం పడిన చోటు ఆలంపూర్. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు.
పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరండం, ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం. అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.
ఈ ఆలయానికి బస్సు, రైలు మార్గాల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే బస్సులన్నీ ఆలంపూర్ మీదుగానే వెళతాయి. కర్నూలుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి కర్నూలుకు బస్సు సౌకర్యం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోని రైల్వేస్టేషన్ కర్నూలు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | మానవుడు ప్రకృతిలో వున్న అందాలను, మాయకు లోబడి, ఇంద్రియాలకు లోనయి అనేకరకాల ప్రవృత్తుల (లక్షణాలు)తో ప్రవర్తిస్తుంటాడు. కొందరు ఒక్కొక్క రకమైన లక్షణాలను కలిగివుంటే.. మరికొందరిలో అన్ని లక్షణాలు ఇమిడి వుంటాయి. అవి తామసిక, రాజసిక,... Read more
Mar 20 | సాధారణంగా సామాన్య మతాచారులు, గురువులు దగ్గరకు శిష్యులు వెళ్లి, లైనుల్లో నిల్చుని.. వారి ఆశీర్వచనాలు, ప్రసాదాలు తీసుకుంటుంటారు. కానీ... భగవాన్ బాబా స్వామి అయితే తాము స్వయంగా భక్తుల దగ్గరకు వెళ్లి వారికి స్వాంతనను... Read more
Feb 18 | ‘‘శరణు’’ అంటే రక్షణ కోసం వేడుకోవడం. ఆ రక్షణ ఇచ్చేవాడు దేవుడు. సాధారణంగా మానవులు తనకు ఆపదలు వచ్చినప్పుడు వాటిని తట్టుకోలేక తన ఇష్టమైన దేవాన్ని రక్షణ కోసం వేడుకుంటారు. అలాగే మరికొందరు తమ... Read more
Feb 17 | వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక జ్ఞానపీఠం, చిలకలూరి పేట అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది. అసలు జన్మలు 3 రకాలు. అవి దేవజన్మ, మానవజన్మ, జంతుజన్మ. అవి ఎలా వస్తాయి..? వాటి ప్రత్యేకత ఏమిటి..?... Read more
Feb 14 | నాది, నేను అన్న భావనలు, కోరికలే దు:ఖ హేతువులు. భూమి మీద జన్మించే ప్రతి మానవుడూ తన కోసం ధనాన్నో, వస్తువులనో సంపాదించుకోవడానికి పడరాని పాట్లు పడుతుంటారు. కోరికలను జయిస్తే పరమాత్మకు దగ్గరవుతాము. బౌద్ధ... Read more