మన భారతదేశంలో భిన్నమతతత్వాలు కలిగినవారు ఎక్కువగా వుండడంతో... పండుగలు కూడా వారివారి విధానాలకు అనుగుణంగానే నిర్వహించుకుంటారు. ముఖ్యంగా హిందువుల పండుగలు లెక్కలేనివన్నీ! సందర్భాలను బట్టి దేవతల పూజలను, కొన్ని పవిత్రమైన కార్యాలను పండుగ రూపంలో వైభవంగా జరుపుకుంటారు. అలాగే మన హిందూ సంస్కృతీ - సంప్రదాయాల ప్రకారం... ప్రాచీనకాలం నుంచి కొన్ని గుర్తుతెలియని పండుగలు కూడా ఇప్పటికీ అమలులో వున్నాయి. పట్టణప్రాంతాల్లో వాటి హవా అంతగా లేకపోయినా.. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రాచీన పండుగలను ఆచారాలుగా వ్యవహరిస్తూ ఘనంగా జరుపుకుంటారు. అటువంటి పండుగల్లో ఒకటైన ఈ ‘‘ఏరువాక పున్నమి’’ ఎంతో ముఖ్యమైంది.
సాధారణంగా ఈ ఏరువాక పున్నమి పండుగను గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం చేసుకునేవారు వైభవంగా నిర్వహించుకుంటారు. ‘‘ఏరువాక’’ అనే పదంలో ‘‘ఏరు’’ అంటే.. ఎద్దులను కట్టి, దుక్కి దున్నటానికి సిద్ధపరిచిన నాగలి అని అర్థం. అంటే దీనిని బట్టి అర్థమయ్యేదేమిటంటే... ప్రత్యేకంగా ఈ పండుగ కేవలం వ్యవసాయదారులకు మాత్రమేనని తెలుస్తోంది. ఈ పండుగను నిర్వహించుకోవడం ప్రారంభం అయిందంటే... గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు కూడా మొదలవుతున్నట్టు లెక్క!
మన భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. ప్రపంచం మొత్తం మీద చాలావరకు పంటలు మన దేశంలోనే ఎక్కువగా పండుతాయి. అందువల్ల మన దేశంలో ఈ వ్యవసాయాన్ని ఒక పవిత్రమైన కార్యంలా రైతులు భావిస్తారు. అలాగే మన పూర్వీకులు ఆనాటిరోజుల్లో భూమిని ఒక దేవతగా పూజించేవారు. ఎందుకంటే.. దేశాన్ని పచ్చని చెట్లతో - పంట పొలాలతో సస్యశ్యామలం చేసి, మానవాళికి అవసరమైన ప్రాణవాయువు, ఆకలిని తీర్చే చల్లని తల్లే మన భూమాత! దాంతో భూమిని భూదేవతగా వర్ణిస్తారు. అటువంటి భూమాతను నాగలితో గుచ్చి, దుక్కిదున్నడాన్ని ఎంతో బాధాకరంగా భావిస్తారు మన రైతన్నలు. అందువల్లే భూదేవతకు క్షమాపణలు చెప్పుకుంటూ.. వ్యవసాయం ప్రారంభించడానికి ముందుగా భూపూజా కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. ఆ విధంగా జరుపుకునే ఈ పండుగను ‘‘ఏరువాక పున్నమి’’గా పరిగణిస్తారు.
మన హిందూ పురాణాలలో కూడా వ్యవసాయం చేయడానికి ముందు భూపూజలు చేసుకోవాలని కొన్ని కథనాలు కూడా వున్నాయి. అలాగే... ఋగ్వేదంలో కూడా... ‘‘తొలిసారిగా భూక్షేత్రంలో నాగలిని కదల్చడానికి ముందు భూపూజ చేసుకోవాలి’’ అని వివరించి వుంది. ఆ భూపూజను కూడా హిందూ శాస్త్రాల ప్రకారం ‘‘జ్యేష్ఠ పౌర్ణమి’’ నాడు జరుపుకోవాలని నిర్ణయించబడి వుంది. అటువంటి పవిత్ర పర్వతినమైన జ్యేష్ట పౌర్ణమిని రైతాంగం ఏరువాక పున్నమిగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రాచీన సాహిత్యాలలో ఈ పండుగను ‘‘వప్పమంగల దివసం’’గా రైతులు జరుపుకునే పండుగదినం అని... పాళీ, ప్రాకృత వంటి భాషలలో జాతక కథల ద్వారా వెల్లడవుతోంది.
పండుగరోజు చేయాల్సిన పనులు - సందడి :
ఏరువాక పున్నమినాడు రైతులు ఎద్దులను శుభ్రం స్నానం చేయించి, వాటి కొమ్ములకు రకరకాల రంగులు అద్ది, వాటి మెడకు - కాళ్లకు గంటలు కట్టి అందంగా అలంకరిస్తారు. అలాగే పొలం పనులకు ఉపయోగించే సామాగ్రిని ముఖ్యంగా ‘‘కాడి నాగలి’’ని బాగా కడిగి.. దానిని రంగురంగుల పువ్వులతో అలంకరిస్తారు. ఆ విధంగా అలంకరించుకున్న ఎడ్లకు, నాగలికి, భూమాతకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి... ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి, ఎడ్లకు ఆహారంగా పొంగలిని పెడతారు. తరువాత కాడి నాగలిని రైతులు తమ భుజాన వేసుకుని, మంగళవాయిద్యాలను వాయించుకుంటూ ఊరేగింపుగా ఎద్దులకు తీసుకుని వెళతారు. అక్కడికి చేరుకున్న తరువాత భూమాతకు నమస్కరించి, భూమిని దున్నడం ప్రారంభిస్తారు. ఇలా ఈ విధంగా ఈ పండుగను భక్తిశ్రద్ధలతో పూర్తి చేసుకుంటారు.
ప్రతి సంవత్సరం ఏరువాక పున్నమినాడు ఈ విధంగా పండుగను నిర్వహించుకుంటే... ఆ సంవత్సరమంతా పంటలు సమృద్ధిగా పండి, లాభాలబాటవైపు నడిపిస్తాయని కర్షకుల ప్రగాఢ నమ్మకం. మరికొన్ని ప్రాంతాలలో ఈ పండుగను కొంచెం ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఊరుబయట గోగునారతో చేసిన ‘‘తోరం’’ కడతారు. రైతులందరూ ఆ ప్రదేశానికి చేరుకుని.. ‘‘చెర్నాకోల’’తో ఆ తోరాన్ని కట్టి.. ఎవరికి దొరికిన నారను వారు తీసుకెళతారు. ఆ నారను నాగళ్లకు, ఎద్దుల మెడలలో కడతారు. ఇలా ఈ విధంగా చేయడం వల్ల వ్యవసాయం, పశుసంపద వృద్ధి చెందుతాయని ఆ ప్రాంత ప్రజల విశ్వాసం! నిజానికి ఈ పండుగ రైతులకు మాత్రమే అయినప్పటికీ... అందరి ఆకలినీ తీర్చే పండుగ కాబట్టి.. ‘‘ఏరువాక పున్నమి’’ని ప్రతిఒక్కరు జరుపుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more
Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more
Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more
Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more
Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more