Tholi ekadashi special story

tholi ekadashi, tholi ekadashi special story, tholi ekadashi story in telugu, tholi ekadashi history in telugu, lord vishnu sleeping, lord vishnu tholi ekadashi, tholi ekadashi news, tholi ekadashi festival, tholi ekadashi pooja procedure, tholi ekadashi pooja procedure in telugu, tholi ekadashi pooja for lord vishnu

Tholi ekadashi special story in telugu which is special festival for farmers and devotees prayer lord vishnu and more

తొలి ఏకాదశి విశేషాలు

Posted: 04/23/2014 04:23 PM IST
Tholi ekadashi special story

ఆషాఢమాసంలోని పౌర్ణమిరోజుకు ముందు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ తొలి ఏకాదశిని ఎంతో ఆధ్యాత్మికంగా ఒక పర్వదినంలా జరుపుకుంటారు. తొలి ఏకాదశిని ‘‘ఆషాఢ ఏకాదశి’’, ‘‘శయన ఏకాదశి’’ అనే పేర్లతో కూడా పేర్కొంటారు. హిందువుల సంప్రదాయాల ప్రకారం వచ్చే తిథుల్లో ఈ ఏకాదశి ఎంతో మంచిది. అందులో తొలి ఏకాదశిని ఎంతో పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఎందుకంటే.. విష్ణుమూర్తిని కొలిచే విష్ణుభక్తులకు ఈ తొలిఏకాదశి రోజు ఎంత ప్రీతికరమైనది విశ్వసిస్తారు. అలాగే చాతుర్మాస్య వ్రతం కూడా ఈరోజు నుంచి అంటే తొలి ఏకాదశిరోజు నుంచి ప్రారంభమవుతుంది. అందువల్లే తొలి ఏకాదశిరోజుకు హిందువులు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు.

పురాణ కథనాల ప్రకారం.. విష్ణుమూర్తి క్షీరసాగరంలోని శేషతల్పం మీద హాయిగా నిద్రపోయి.. తొలిఏకాదశినాడు నిద్రను ఉపక్రమించాలని (నిద్రలేవడం) అనుకున్నాడట. అలా ఆ విధంగా పడుకున్న విష్ణుమూర్తి.. నాలుగు నెలల తరువాత వచ్చే ప్రబోధినీ ఏకాదశినాడు మేలుకున్నాడట. దాంతో ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా పేర్కొంటారు. తొలిఏకాదశి పండుగను కూడా సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగల్లాగే జరుపుకుని.. ఆరోజు ఉపవాసం వుంటారు.

ముఖ్యంగా ‘‘తొలిఏకాదశి’’ రైతులకు ఎంతో ఆధ్యాత్మికమైన పండుగ రోజు. ఈ పర్వదినంరోజు రైతులు తమ నాగలి, గునపము, ఇంకా మొదలైన పరికరాలకు పూజా కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. వారు చేసుకునే పనులలో ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు రాకుండా వుండటానికే, అలాగే అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని ఇలా ఈ విధంగా పూజలు చేస్తారు. ఇంతటి పవిత్రమైన రోజున ఏవైనా పనులు నిర్వహించుకుంటే అవి విజయవంతం అవుతాయని రైతులు, ఇతర చేతివృత్తులవారు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

ఈ తొలిఏకాదశి పర్వదినంనాడు.. మొక్కజొక్క పేలాలను మెత్తగా దంచి, పొడిగా చేసుకుంటారు. అందులో నూరిన బెల్లంను కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించుకుని, ప్రసాదంగా తీసుకుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Vilambi nama samvasthara ugadi special story

  ఉగాది పండగ విశిష్టత.. కథలు తెలుసా.?

  Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more

 • Kanuma festival special

  కనుమ పండుగ విశిష్టత

  Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more

 • Bhogi festival special

  భోగభాగ్యాల భోగి పండుగ

  Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more

 • Bathukamma the floral festival of telangana

  తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ

  Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more

 • Dasara navarathri special article

  దసరా శరన్నవరాత్రులు

  Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more

Today on Telugu Wishesh