సలేశ్వర క్షేత్రం
ఆకాశ గంగను తలపించే విధంగా వుండే జలపాతమే సలేశ్వర క్షేత్రంగా పిలువబడుతుంది. ఇక్కడున్న కొండల్లో శివుడు కొలువై ఉన్నాడు. పచ్చని చెట్లు, ఎగిసిపడే జలపాతాలు, ఎత్తైన కొండలు, లోతైన గుహలు, పక్షుల కిలకిల రాగాలు, వన్య ప్రాణులతో కిటకిట లాడే ఈ ప్రాంతం స్వర్గంలా అనిపిస్తుంది.