మున్నార్
ఈ అద్భుతమైన హిల్ స్టేషన్ కేరళలోని ఇడుక్కి జిల్లాలో వుంది. ప్రముఖ పర్యాటక ప్రదేశంగా పేరుగాంచిన ఈ ప్రాంతం పూర్తిగా కొండలతో చుట్టుముట్టబడి ఉంటుంది. ఇక్కడ అనేక ట్రెక్కింగ్ ప్రదేశాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. ఇక్కడో విశేషం ఏమిటంటే.. ఈ ప్రాంతంలో 12 సంవత్సరాలకొకసారి నీలక్కురింజి పూవులు పూస్తాయి.