కిరణ్ బేడీ
భారతదేశపు మొట్టమొదటి మహిళా ఐఏఎస్ అధికారిణిగా పగ్గాలు చేపట్టి, తోటి మహిళలకు ఆదర్శంగా నిలిచింది కిరణ్ బేడీ! 1972వ బ్యాచ్ కు చెందిన కిరణ్ బేడీ... పోలీసు శాఖలో ఎన్నో పదవులను చేపట్టింది. అనేక సంస్కరణలు చేపట్టిన మహిళగా గుర్తింపు పొందడంతో ఈమెకు మెగసెసె అవార్డుతో సహా, పలు అవార్డులను కూడా భారత ప్రభుత్వం సత్కరించింది. అయితే రానురాను రాజకీయ పరిస్థితులు ఘోరంగా మారుతున్నాయని భావించిన కిరణ్ బేడీ.... 2007 డిసెంబర్ లో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవలప్ మెంట్ డైరెక్టర్ జనరల్ పదవికి స్వచ్ఛందంగా విరమణ తీసుకున్నారు.