క్యామిలా ఏల్వాస్
ఈమె తన 15వ ఏటలో వున్నప్పుడు అత్తను కలుసుకోవడానికి బ్రెజిల్ రాష్ట్రంలోని మినాస్ గెరాయిస్ ప్రాంతం నుంచి లాస్ ఏంజెలిస్ కి వెళ్లిన రంగురంగుల భామ.. అక్కడి నుంచి తిరిగి మళ్లి వెనక్కు రాలేదు. అక్కడే వెయిటర్ గా కొన్నాళ్ల వరకు తన జీవితాన్ని గడిపిన ఈమె.. తన 19 ఏట వచ్చినప్పుడు మోడలింగ్ కెరీర్ ను ప్రారంభించడానికి న్యూయార్క్ కు బయలుదేరింది. ఆ విధంగా మోడలింగ్ ప్రారంభించిన ఈ డస్కీ బ్యూటీ కొన్నాళ్ల తరువాత మ్యాథ్యూ మెక్ కొనాఫే అనే ఒక యాక్టర్ తో ప్రేమాయణం నడిపి, పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. అయితే ప్రస్తుతం ఆమె మోడలింగ్ నుంచి తప్పుకుని హ్యాండ్ బ్యాగ్‌ల బిజినెస్ చేసుకుంటోంది.