Every breach of promise to marry is not rape says bombay hc

Bombay high court, Bombay HC, Bombay HC most significant verdict, sex, rape, pre-maritial sex, breach of marriage to marry not rape, Bombay HC significant verdict, Bombay HC significant verdict on Rape, pre-marital sex in India's big cities, sexual relationship not rape, affair before marriage not a rape, society is becoming permissive, younger generations experiencing sex, younger generations western culture, bombay HC says sex is basic biological need,

the Bombay high court has ruled that every breach of promise to marry is not rape and pre-marital sex between couples is no longer shocking in India's big cities.

అంగీకార శృంగారాన్ని తరువాత అత్యాచారంగా పరిగణించవచ్చా..

Posted: 12/29/2014 07:33 PM IST
Every breach of promise to marry is not rape says bombay hc

పరస్పర అంగీకారంతో జరిగే శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించ వచ్చా అన్న ప్రశ్నకు బోంబాయ్ హైకోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ఈ ఏడాది ఇచ్చిన పలు సంచలన తీర్పుల జాబితాలో ఈ తీర్పు చేరింది. పరస్పర అంగీకాంతో జరిగే శృంగారాన్ని అ తరువాత కొన్నాళ్లకు రేప్ గా పరిగణించలేమని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. బాగా చదువుకున్న అమ్మాయిలు పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొని, ఆ తర్వాత మనసులు విడిపోయినప్పుడు అత్యాచారం ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇటీవలి కాలంలో కొందరు ప్రియురాళ్లు లవర్స్‌ తమను రేప్‌ చేశారని చేశారని కూడా కేసులు పెడుతున్నారు. ఈ తరహా ఆరోపణలకు బలముంటుందా? అసలు ఏది పరస్పర అంగీకార శృంగారం? ఏది రేప్‌? ఎలా తెలుసుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉపయోగపడుతుంది.

ముంబైకి చెందిన ఇద్దరు లాయర్లు 1999 నుంచి ప్రేమించుకుంటున్నారు. 2006 నుంచి వారి మధ్య శారీరక సంబంధం ఉంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట నిలబెట్టుకోవడం లేదని 2009లో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. కానీ ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య శారీరక సంబంధం కొనసాగింది. చివరకు ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్లి కావడంతో అతడు తనను మోసం చేశాడని, కొంతకాలం పాటు రేప్‌ చేశాడని 2013లో ఆమె కేసు పెట్టింది. అయితే తమ మధ్య పరస్పర అంగీకారంతోనే శారీరక సంబంధం కొనసాగిందని అతడు కోర్టులో వాదించగా.. అతడి వాదనలో బలముందని భావించిన హైకోర్టు.. ముందస్తు బెయిల్ మంజూరుచేసింది.

ఈ కేసు విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మృదులా భత్కల్‌  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఈరోజుల్లో పెళ్లికి ముందు సెక్సువల్‌ రిలేషన్స్‌ గతంలో ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. ఏ జంటయినా సెక్స్‌ అనుభూతి కావాలని కోరుకోవచ్చు. ముంబై, పుణె లాంటి నగరాల్లో సమాజంలో ఈ స్వేచ్ఛ పెరుగుతూ వస్తోంది. ఈ మార్పును కోర్టు పట్టించుకోకుండా  ఉండలేదు. నేడు సహజీవనాన్ని చట్టం గుర్తిస్తోంది.

అలాగే శృంగారం కావాలా? వద్దా? తల్లి కావాలా? వద్దా? అనే హక్కులు కూడా మహిళకు ఉన్నాయని చట్టం చెబుతోంది. అందువల్ల ఒక పరుషుడితో మహిళకు ఉన్న శారీరక సంబంధం స్పృహతో పెట్టుకున్నదా? కాదా? అనే అంశాన్ని ఏ కేసుకు ఆ కేసు విడిగా తేల్చాల్సిందే. అన్ని సందర్భాలకు తగ్గట్లు ఒకే రకమైన తీర్పు చెప్పలేం. జంట మధ్య ప్రేమ ఇంకిపోయిన తరువాత అంతకుముందున్న సంబంధాన్ని రేప్‌గా పరగణించలేం.ఈ కేసులో ఆమె ఒక విద్యావంతురాలు. స్పృహతోనే ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడిందనే విషయాన్ని తోసిపుచ్చలేం'' అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : bombay high court  rape  breach of marriage promise  verdict  

Other Articles