Married daughter unsuitable for compassionate recruitment

Married Daughter, suitable, compassionate recruitment, Madras High court, eligible, Violation, fundamental rights, Equalent, son, daughter, Discrimination

Married Daughter unsuitable for compassionate recruitment?

కారుణ్య నియామకాలకు.. వివాహిత కూతురు పనికిరాదా?

Posted: 11/07/2014 11:57 AM IST
Married daughter unsuitable for compassionate recruitment

కారుణ్య నియామకాలకు వివాహితులైన కూతురు పనికిరాదా అన్నది పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వ అధికారుల నుంచి మాత్రం వారు అర్హులు కారేనే సమాధానమే వస్తుంది. కారుణ్య నియామాకాలకు వివాహమైన అబ్బాయిలు అర్హులైనప్పడు.. తామెందుకు కాము అన్న ప్రశ్న వారిలో ఉత్పన్నమవుతోంది. ఆడవారికి, మగవారికి మధ్య ఇంతటి వివక్ష ఎందుకని చెన్నైకి చెందిన రేణుకలో రేగిన సందేహమే.. ఆడవారికి ఇకపై వరంలా మారనుంది. బతులకు బండి లాగేందుకు మార్గాన్ని చూపనుంది.

పీఆర్ రేణుక ఎవరీవిడ అనుకుంటున్నారా..? ఈమె కూడా ఓ ప్రభుత్వ ఉద్యోగి కూతురు. అమె తండ్రి తమిళనాడు పశుసంవర్ధకశాఖలో కార్యాలయ సహాయకుడిగా పనిచేస్తూ 1998లో మరణించారు. అప్పటికే ఆమె పెళ్త్లె, భర్త నుంచి విడాకులు పొంది తండ్రి వద్ద నివసిస్తున్నారు. తండ్రి మరణంతో కారుణ్య నియామకం కింద తండ్రి ఉద్యోగం తనకు ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే సంతానంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తుంటారు. భర్త నుంచి విడిపోయినట్లు విడాకుల మంజూరు పత్రాలను కూడా పొందుపరిచారు. అయితే ఆమెకు వివాహమైంది కాబట్టి కారుణ్య నియామకానికి అర్హురాలు కాదంటూ అధికారులు అభ్యర్థనను తిరస్కరించారు. దాంతో ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

రేణుక వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. మరణించిన ఉద్యోగి కుమార్తెకు వివాహమైందనే కారణంతో ఆమె కారుణ్య నియామకానికి అనర్హురాలనే వాదనను న్యాయస్థానం తప్పుపట్టింది. 'పెళ్లి అయిన కుమారుడు కారుణ్య నియామకానికి అర్హుడవొచ్చు కానీ, పెళ్లయిన కుమార్తె మాత్రం అర్హురాలు కాదా, ఏమిటీ వివక్ష?' అంటూ ధర్మాసనం ఘాటుగా ప్రశ్నించింది. కేసు విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.హరిపరంధామన్ అధికారుల తీరును తప్పుబట్టారు. పెళ్త్లెన కుమార్తె, కొడుకూ ఇదరూ సమానమేనని, కుమార్తెకు పెళ్లయిందని వివక్ష చూపడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని న్యాయమూర్తి అన్నారు. పిటిషనర్‌కు ఉద్యోగం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఇక మీదట కారుణ్య నియామకాలకు వివాహితురాలైన కూతుళ్లు కూడా అర్హులే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles