I get my share of the property

property law, father property, law, law advice

I get my share of the property.

నాన్న గారి ఆస్తిలో వాటా వస్తుందా ?

Posted: 01/03/2014 05:30 PM IST
I get my share of the property

మా నాన్నగారికి పిత్రార్జితమైన ఆస్తిగా 192 గజాల ఇల్లు, 242 గజాల ప్లాటు ఉన్నాయి. మా నాన్నగారికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. మా నాన్న గారు 2005లో మరణించారు. ఆ తరువాత బ్యాంక్‌లో కారు లోన్ తీసుకుని, మా నాన్నగారి పేరు మీద ఉన్న దస్తావేజులను ఈక్విటబుల్ మార్ట్‌గేజ్ క్రింద19-6- 2006లో బ్యాంక్‌కు ఇచ్చారు. ఆ కాగితం మీద మా నాన్న గారి వారసులు మొత్తం ఫోటోలు పైన సంతకాలు పెట్టి ఇచ్చారు. నాన్నగారి తల్లి కూడా సంతకం చే శారు. మొత్తానికి బ్యాంక్ లాయర్ ఓపినియన్ ఇచ్చాక రుణం మంజూరు అయ్యింది.

అయితే 5-9-2006లో మా నానమ్మ 242 గజాల ప్లాటును ఎవరికో అమ్మేసింది. ఈ విషయం ఐదేళ్ల క్రితం బయటపడింది, మా నానమ్మ గురించిన ఆరా తీస్తే ఆమె 2007లో మరణించినట్లు తెలిసింది. ఆ విషయాన్ని మాకు ఎవరూ చెప్పలేదు. ఈ అమ్మకం ఎలా చేసిందనే విషయాన్ని పరిశీలిస్తే మా నాన్నగారు 1975లో తన బావమరిదికి ఆ భూమిని రిజిస్టర్‌చేశాడు. మరిది నుంచి తిరగి 1982లో తల్లికి రాసి ఇచ్చాడు. దస్తావేజులు బ్యాంక్‌లో ఉన్నప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేశారని సబ్‌రిజిస్ట్రార్‌ను అడిగితే, అవన్నీ కొనేవాళ్లు చూసుకోవాలి అంటున్నారు. ఆమె చేసిన రిజిస్ట్రేషన్ రద్దు కావాలంటే ఏంచేయాలి? ఎవరికి సంప్రదించాలి? ఆ వివరాలను తెలియచేయండి.

ఏ వ్యక్తి అయినా తన స్వార్జితమైన ఆస్తిని తన యిష్టాయిష్టాల మేరకు అన్యాక్రాంతం చేయడానికి వీలు ఉంటుంది. మీ విషయంలో మీ నాన్నగారికి తన పిత్రార్జితంగా వచ్చిన ఆస్తిని అమ్మడానికి గానీ, తనఖా పెట్టడానికి గానీ అ«ధికారం లేదు. కానీ మీ నాన్నగారు తాను బతికుండగానే ఇతరులకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసినట్లుగా తెలియచేశారు. నిజానికి మీ నాన్నగారికి మాత్రమే తన పిత్రార్జితంగా వచ్చిన ఆస్తిని వేరే వారికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసే అధికారం లేదు. ఈ విషయాన్ని దాచి కారు లోన్ కోసం ఆ ఆస్తి పత్రాలను తనఖా పెట్టి, అప్పు పొందినందువల్ల ఆ అప్పును రాబట్టుకోవడం కోసం, ఆ తనఖా పెట్టిన ఆస్తిపై, మీ హక్కుల మేరకు మీ డబ్బులు రాబట్టుకోవడానికి వీలుంటుంది. కేవలం తాను రిజిస్ట్రేషన్ చేసినందువల్ల , ఆ రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తికి అంటే పూర్తి హక్కులు లేని వ్యక్తి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నందువల్ల మీ హక్కులకు మీ డబ్బులకు వచ్చే సమస్య ఏదీ లేదు. వారు తెలియచేసినట్లుగా నే వ్యక్తి అయినా ఏదైనా ఒక ఆస్థిని కొనే ముందు అమ్మే వ్యక్తికి అ ఆస్థిపైన సంపూర్ణ యాజమాన్యపు హక్కులు ఉన్నాయా లేదా ఆ ఆస్థికి సంబంధించి ఏమైనా వివాదాలు ఉన్నాయా అని తెలుసుకునే బాధ్యత ఆ కొనే వ్యక్తి మీదే ఉంటుంది.

మీ విషయంలో తన నాన్నగారు బతికుండగా చేసిన గిఫ్ట్ రిజిస్ట్రేషన్, ఇతర లావాదేవీలను మభ్యపెట్టి, మీరు కారు లోను పొంది తనకు పిత్రార్జింగా వచ్చిన ఆస్తి పత్రాలను లాయర్ గారి లీగల్ ఒపీనియన్ తీసుకునే ఈక్విటబుల్ మార్ట్‌గేజ్‌గా టైటిల్ డీడ్‌ను డిపాజిట్ చేసినందువల్ల మీకు మీ లోను రాబట్టుకోవడానికి, ఒకవేళ ఆ లోన్ తీసుకున్న వ్యక్తి లోన్ మొత్తాన్ని చెల్లించనట్లుతే, ఆ ఆస్తిపై వారు ప్రొసీడ్ కావడానికి కోర్టు ద్వారా వీలవుతుంది. మీ విషయంలో మీ నాన్న గారిది స్వార్జితమైన ఆస్తి కాదు కాబట్టి, అవి పూర్తిగా పిత్రార్జితమే కాబట్టి, అవి మీ నాన్నగారితో పాటు ఆయన కుమారులకు ఆయన తల్లికి సమాన హక్కులు ఉంటాయి. మీ నాన్నగారు చనిపోయినందువల్ల మీతో పాటు మీ అమ్మాగారికి మీ నాన్నగారి వాటాలో హక్కు ఉంటుంది. అందువల్ల మీ నాన్నగారు తనకు లేని హక్కులను ఆ భూమిపై ఉన్నాయనుకుని వేరే వారికి గిఫ్ట్ చేసినట్లయితే, చట్టపరంగా అది చెల్లదు.

ఒకవేళ గిఫ్ట్ చేసిన ఆస్తిని కూడా వేరే వాళ్లకు స్వాదీన పరిచిన ట్లయితే, ఆ విషయం మీకు తెలిసిన మూడే ళ్ల లోపల సంబంధిత సివిల్ న్యాయస్థానంలో ఆ గిప్ట్ డీడ్‌ను రద్దుపరచమని, మీ కు రావలసిన వాటాను కోరుతూ దావా వేయవలసి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ మీ నాన్నగారికి మాత్రమే హక్కులు లేకుండా చేసిన రిజిస్ట్రేషన్ కాబట్టి కోర్టు వారు పూర్వాపరాలు విచారించి ఆ రిజిస్ట్రేషన్‌ను రద్దుపరిచి సరియైన హక్కుదారులకు వారి వాటాల మేరకు వారికి ఆస్తిని దఖలు పరచడానికి వీలు ఉంటుంది. వ్యక్తులు వారికి రావలసిన వాటా విలువ వాటా ఆధారితంగా సరియైన సివిల్ న్యాయస్థానాన్ని సంప్రదించవలసి ఉంటుంది. ఏమైనా, ఈ విషయంలో పూర్తి వివరాలతో మీ దగ్గరలోని నిపుణులైన సివిల్ న్యాయ వాదిని సంప్రదిస్తే మీకు న్యాయం జరగగలదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles