Divorce husband and wife

Divorce, husband, wife, law

Divorce-husband and wife

Divorce-husband and wife.png

Posted: 10/17/2012 09:09 PM IST
Divorce husband and wife

wife-and-husband-divorceనాకు 1999లో పెద్దల సమక్షములో వివాహము జరిగినది. ఆ తరువాత నాకు ఒక కుమారుడు జన్మించాడు. అతని వయస్సు 14 సంవత్సరాలు. నాకు, నా భర్తకు మధ్య చాలా కాలం నుండి గొడవలు జరుగుతున్నా యి. ఇదిలావుండగా... ఈ మధ్యకాలంలో ఒకతనితో పరిచయం ఏర్పడినది. ఈ విషయం గురించి నా భర్తకు పూర్తి వివరాలతో తెలియజేయడం జరిగింది. దానికి ఆయన కూడా ఒప్పుకున్నాడు. దానికి కారణం లేకపోలేదు. నా భర్తకు నాతో పెళ్ళి కావడానికి ముందు ఒక ముస్లిం యువతితో పరిచయం ఉన్నది. ఆ విషయం నాకు ఆయనే చెప్పారు. తరువాత మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. తరువాత నా భర్తకు ప్రభుత్వ ఉద్యోగము వచ్చినది. అక్కడ సర్వీస్‌బుక్‌లో ఇతర వ్యవహరము అనగా పాలసీలతో సహా ‘నామినీ ’ క్రింద పేరు నమోదు చేసినాడు. ఇప్పుడు నా కొడుకు ఆరోగ్యం బాగా లేదు, నాకు సంపాదన లేదు. చాలా కష్టముగా ఉన్నది ఈ విషయంలో మా దగ్గరలో న్యాయవాదిని కలువగా అతను విడాకులు తీసుకోమని సలహ ఇస్తున్నాడు. అయితే అలా చేయవచ్చో లేదో అర్థం కావడం లేదు. కావున నాయందు దయతలచి ఉత్తమమైన న్యాయ సలహా ఇవ్వవలసిందిగా మనవి.

మీకు మీ భర్తకు మధ్యలో ఎలాంటి గొడవ లు ఉన్నది పూర్తి వివరాలు తెలియజేయలేదు. మీ పెళ్ళికి ముందు ముస్లిం అమ్మాయితో వివాహేతర సంబంధము ఉన్నట్లు మీ భర్త మీకు చెప్పినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకొన్నారో చెప్పలేదు. అదే విధముగా మీరు కూడా మీ భర్త అనుమతితో మరో వ్యక్తితో వివా హేతర సంబంధం ఏర్పరుచుకున్నాను అని చెప్పారు. అయితే అతన్ని పెళ్ళి చేసుకున్నారా లేదా చెప్పలేదు. ఒకవేళ అతన్ని పెళ్ళి చేసుకుంటే దానికి ఏమైనా సాక్ష్యాదారాలు ఉన్నాయా ? ఏదేమైనా మీరిద్దరు కలిసి మీ కొడుకు జీవితాన్ని పాడుచేస్తున్నారు. ఇప్పుడైనా మించి పోయింది లేదు. మీకు రెండవ వ్యక్తితో పెళ్ళి కాని ఎడల, ఎలాంటి ఆధారములు లేని ఎడ ల మీ భర్తతో తిరిగి కలిసి కాపురం చేయుటకు హిందూ వివాహ చట్టము లోని సెక్షన్‌ 9 ప్రకారము కోర్టులో కేసు వేయగలరు.

అదే విధముగా మీకు గాని మీ భర్తకు గాని సంబంధించిన బంధు, మిత్రుల ద్వారా ఇద్దరు తప్పులను గురించి చర్చించి దాని ద్వారా సమస్య పరిష్కారము చేసుకోగలరు, లేనిచో కోర్టు ద్వారా, రక్షణ, పోషణ, నివాసము, పిల్లవాడి ఆరోగ్య ఖర్చులు, నష్ట పరిహరము అడుగవచ్చును, అదే విధముగా మీరు ముం దు చేసుకొన్న వివాహ ఆధారములు అనగా కలిసి దిగిన ఫొటోలు, ప్రభుత్వం తరుపున రేషన్‌కార్డుగాని పెళ్ళికార్డు, ఇవి ఏమి లేనిచో మీ యొక్క మండల రెవెన్యూ కార్యాలయము నుండి మీ భర్త యొక్క హక్కు సర్టిఫికేట్‌ తీసుకొని మీ దగ్గరలోని మరో న్యాయవాదిని సంప్రదించి అతని ద్వారా మీ భర్త పనిచేస్తున్న పై అధికారికి, మీ భర్తకు, మీ భర్తకు గల అక్రమ భార్యను ఈ ముగ్గురిని పార్టీ చేసి కోర్టులో డిక్లరేషన్‌ దావా వేసినచో తప్పక మీ భర్త ఉద్యోగము చేస్తున్న ఆఫీసులో అదే విధముగా ఇతర సంపాదనలో హక్కు అనగా ‘నామినీగా ’ న్యాయం జరుగును, కావున ఇవి అన్నీ జాగ్రత్తగా సాక్ష్యాదారాలతో సహా కోర్టుకు సమర్పిం చండి. తప్పక న్యాయము జరుగును.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  How to get an immediate divorce
Discuss problems in land  
Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles