Harish rao fires on cm kiran participate in seemandhra strike ashok babu

Harish Rao fires on CM kiran, Participate in Seemandhra Strike Ashok babu, cm kiran, hyderabad heavy rain, ashok babu, harish rao,

Harish Rao fires on CM kiran, Participate in Seemandhra Strike Ashok babu

సీటీలో భారీ వర్షం- సిఎం పక్షపాతి-సమ్మెను కొనసాగిస్తాం

Posted: 09/16/2013 06:28 PM IST
Harish rao fires on cm kiran participate in seemandhra strike ashok babu

నగరంలో ఈరోజు మధ్యాహ్నం కురిసన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో ట్రాపిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీనితో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. లకడికపూల్, కోఠి, దిల్ సుఖ్ నగర్, సికిందరాబాద్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. గంటల తరబడి వాహనాలు బారులు తీరి నిలబడిపోయాయి. ఇదిలా ఉంటే రాజేంద్రనగర్ పిల్లర్ నెంబర్ 190 వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వర్షానికి సగానికి కార్లు, బైక్ లు మునిగిపోయాయి. అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో వాహనదారులు పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

 

సిఎం పక్షపాతి

సిఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని టిఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సిఎం బొమ్మను రేషన్ కార్డులపై ముద్రించే విషయంపై చర్చ జరుగుతుండడంతోనే రేషన్ కార్డుల జారీలో జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ద్రోహుల బొమ్మలను రేషన్ కార్డులపై ముద్రించడానికి వీళ్లేదని అన్నారు. సిఎం కిరణ్ రాష్ట్ర పాలనను మరచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. మొదటి విడతలో ఇచ్చిన కూపన్లకు ఇప్పటివరకూ రేషన్ కార్డులను జారీ చేయలేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసుల రక్షణతో తెలంగాణ ప్రాంతంలో రచ్చబండ ఏర్పాటు చేసిన సిఎం ఇప్పుడెందుకు నిర్వహించడం లేదన్నారు. రాష్ట్రంలో ఏడో విడత భూపంపిణీ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు.

 

సమ్మెను కొనసాగిస్తాం

 

సమ్మెను కొనసాగిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్లు చెప్పారు. సమ్మె స్వరూపాన్ని మార్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more